అమెరికా, కెనడాలలో 21 వేలకు పైగా సివిక్ కార్ల రీకాల్: హోండా

Honda Recall
జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం హోండా మోటార్ కంపెనీకు మరో షాక్ తగిలింది. జపాన్ సునామీ వల్ల జరిగిన కష్టనష్టలా అంచనాల వివరాలు ఇంకా పూర్తిగా తేలకమునుపే కంపెనీపై మరో పిడుగు పడ్డట్లైంది. అమెరికా, కెనడాలలో హోండా మోటార్స్ కంపెనీ విక్రయించిన ప్రస్తుత కాంపాక్ట్ సెడాన్ మోడల్ 'సివిక్' కార్లను రీకాల్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మోడల్ కార్లలో ఇంధనం లీక్ కావడానికి అవకాశాలు ఉన్నందువల్లే వీటిని రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ, యూఎస్ రెగ్యులేటర్స్ వెల్లడించారు.

కాగా.. హోండా మోటార్స్ తాజా రీకాల్‌లో దాదాపు 21,700 సివిక్ కార్లు ఉన్నాయి. విరిగిపోయిన (క్రాక్) రోల్-ఓవర్ వాల్వ్ కారణంగా.. ఇంధన ట్యాంక్ నుంచి ఇంధనం లీక్ అయి ప్రమాదాలు సంభవించే ఆస్కారం ఉందని, అయితే ఈ లోపానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రమాదాలు నమోదు కాలేదని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకే ముందస్తు చర్యగా ఈ రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

అమెరికాలో 18,000 పైగా సివిక్ కార్లను, కెనడాలో 3,600 పైగా సివిక్ కార్లను రీకాల్ చేసినట్లు కంపెనీ తెలిపింది. అమెరికా కెనడాలలో తయారు చేసిన కార్లలో మాత్రమే ఈ ఫ్యూయెల్ వాల్వ్ సమస్య ఉంటుందని కంపెనీ వివరించింది. ఈ రీకాల్‌కు సంబంధించిన సమాచారాన్ని వినియోగదారులకు ఏప్రిల్ మధ్య భాగంలో ఉత్తరాల ద్వారా తెలియజేస్తామని హోండా మోటార్ కంపెనీ వెల్లడించింది.

More from DriveSpark

Article Published On: Friday, March 18, 2011, 15:59 [IST]
English summary
Japanese auto gaint Honda Motor Co is now recalling its sedan model car Honda Civic about 21,700 units in America and Canada. Honda Civic cars recalling due to the possibility that fuel will leak in a roll-over crash, the company said in statement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+