ఈజిప్టు అల్లర్లు: మారుతి ఎగుమతులపై ప్రభావం

Maruti Suzuki
గత కొద్ది రోజులుగా ఈ జిప్టులో జరుగుతున్న అల్లర్ల కారణంగా పలు వాణిజ్య సంస్థలు భారీగా నష్టపోతున్నాయి. ఈజిప్టులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కొన్ని భారతీయ కంపెనీలు కూడా తమ ప్లాంట్లను మూసివేశాయి. ఫలితంగా భారత్‌ నుంచి ఈజిప్టు వెళ్లే ఎగుమతులు స్థంభించిపోయాయి. భారత ఆటో దిగ్గజం మారుతి సుజికి ఇండియా కూడా ఈజిప్టులో జరుగుతున్న అల్లర్ల కారణంగా తమ ఎగుమతులను చేజార్చుకుంది. మారుతి మొత్తం ప్రపంచ ఎగుమతులకు గానూ ఈజిప్టులో కేవలం 3 శాతం మాత్రమే ఎగుమతి చేయగలిగిందని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

గత ఆర్థిక సంవత్సరంలో ఈజిప్టుకు 1.47 లక్షల యూనిట్ల కార్లను ఎగుమతి చేశామని, వీటిలో ఆల్టో విక్రయాలే అధికంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈజిప్టు అల్లర్ల వల్ల నష్టపోయిన కంపెనీలలో ఏషియన్ పెయింట్స్, మారికో, డాబర్ వంటి కంపెనీలతో పాటు మారుతి కూడా ఒకటి. మారుతికి అత్యంత పటిష్టమైన యూరప్ మార్కెట్లో కూడా ప్రస్తుతం ఎగుమతులు మందగించాయి. మారుతి జనవరి ఎగుమతులు 36 శాతం పడిపోయాయి. జనవరి, 2010లో 14,562 యూనిట్లుగా ఉన్న ఎగుమతులు జనవరి, 2011లో 9,321 యూనిట్లకు పడిపోయినట్లు కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 3, 2011, 16:19 [IST]
English summary
The ongoing onslaught of civilian unrest in Egypt has affected the export prospects of Maruti much. For the company, the export to Egypt accounts for 3% among global exports and the 10-day old people’s anger has hit the company to a much level, said the Managing Chief Executive Officer of Maruti.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+