త్వరలో వోల్వో సిఎన్జీ సిటీ బస్సులు

Volvo CNG Bus
వోల్వో బస్సుల నాణ్యతకు పెట్టింది పేరు. అలాంటి వోల్వో బస్సు కంపెనీ నుండి కొత్తగా 8400 సిఎన్జీ వర్సన్ సిటీ బస్సులను ఈసంవత్సరం మూడవ క్వార్టర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొట్టమొదటగా ఈ సిఎన్జీ వర్సన్ సిటీ బస్సులను ఢిల్లీ, ముంబయి లలో ప్రవేశపెట్టనున్నారు. ఈవిషయాన్ని స్వయంగా కంపెనీ ప్రెసిడెంట్ వెల్లడించడం విశేషం. ప్రస్తుతానికి ఈ సిఎన్జీ వర్సన్ సిటీ బస్సులను ఢిల్లీ లో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఇక ఖరీదు విషయానికి వచ్చేసరికే ప్రస్తుతం ఉన్నటువంటి డీజిల్ మోడళ్శుతో పోల్చుకుంటే 15-20శాతం వరకు ఎక్కవ ఉండవచ్చునని అభిప్రాయపడుతున్నారు.

వోల్వో కంపెనీ ఈ సిఎన్జీ వర్సన్ సిటీ బస్సులను కర్ణాటకలోని హొస్ కోటె లో తయారు చేస్తుంది. ఇండియాలో ఉన్న బస్సు సెగ్మెంట్ లో తనదైన ముద్ర వేయడానికి ఈ సిఎన్జీ వర్సన్ సిటీ బస్సులను ప్రవేశపెడుతున్నామని అన్నారు. ఇది మాత్రమే కాకుండా త్వరలో హైబ్రెడ్ వర్సన్ ను కూడా విడుదల చేయనున్నట్లు, ఇందులో ఎలక్ట్రిసిటీ, డీజిల్ మోడళ్శు రంగంలోకి దించుతున్నామని అన్నారు. దీనివలన 40శాతం ప్యూయల్ కాస్ట్ తగ్గుతుందని అన్నారు.

రాబోయే రోజుల్లో ఇండియన్ బస్సు మార్కెట్ త్వరితగతిన అభివృధ్ది చెందడం మాత్రమే కాకుండా ఆసియా స్టాండర్డ్స్ లోకి దూసుకుపోతుందని అన్నారు. ప్రస్తుతం వోల్లో బస్సులను అత్యధికంగా వాడుతున్న దేశాలలో చైనా, మెక్సికో, యూరప్ తర్వాత నాల్గవ స్దానంలో ఇండియా ఉందని అన్నారు. ఇది మాత్రమే కాకుండా రానున్న రోజుల్లో వోల్వో బస్సులను లోకల్ గాఉపయోగించడమే కాకుండా ఎగుమతులకు సంబంధించి మార్కెట్ లోకి అందుబాటులోకి తేనున్నామని అన్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, January 13, 2011, 11:39 [IST]
English summary
Volvo, the Swedish bus maker informed its roll out of 8400 CNG version city buses during the third quarter of this year, preferably in Delhi and Mumbai in the first phase. This was revealed by the company President who could not disclose further details. Currently the buses are on field trial in Delhi and he hinted that the price of this buses may rise by 15-20% than the existing diesel models.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+