భారత్‌లో ప్లాంటు ఏర్పాటుకు ప్యూజో సిట్రాన్ సన్నాహాలు

Peugeot Citroen
పదేళ్ల క్రితం భారత ఆటోమార్కెట్‌ నుంచి వైదొలగిన యూరోపియున్ కార్ల తయూరీ సంస్థ పీఎస్‌ఏ ప్యూజో సిట్రాన్ మరోసారి భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది. మధ్య తరహా సెడాన్ (మిడ్-సైజ్‌డ్) కారును భారత్‌లో విడుదల చేయడం ద్వారా దేశీయ మార్కెట్లోకి పునఃప్రవేశించాలని భావిస్తోంది. వాస్తవానికి ఈ కంపెనీ 2009లోనే భారత్‌లోకి ప్రవేశించాల్సి ఉంది. కానీ..ప్యూజో భారత్‌లోనే పూర్తిస్థాయి తయారీ యూనిట్‌ను నెలకొల్పాలని నిర్ణయించింది. ఇందుకు గానూ కంపెనీ ప్లాంటు ఏర్పాటు కావలసిన స్థలాల అన్వేషణలో ఉన్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (ఆసియా) గ్రెగోర్ వెల్లడించారు.

అయితే ఈ సెడాన్ విడుదలకు సంబంధించి కంపెనీ ఇంకా సమయాన్ని ఖరారు చేయలేదు. రానున్న నాలుగేళ్లలో వివిధ విదేశీ మార్కెట్లలో 50 శాతం కార్లను విక్రయించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్లాంటును ఆంధ్రప్రదేశ్‌లో కానీ లేదా తమిళనాడులో కానీ స్థాపించాలని భావిస్తోంది. ఈ మేరకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా కంపెనీ చర్చలు జరిపింది. ఇప్పటికే ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) నుంచి కంపెనీ కొంత సమాచారాన్ని కూడా సేకరించింది. గతంలో ఈ సంస్థ భారత్‌లోని ప్రీమియుర్ గ్రూపుతో కలిసి పనిచేసింది. కానీ 2001లో ఈ జాయింట్ వెంచర్ నుంచి ప్యూజో వైదొలిగింది.

More from DriveSpark

Article Published On: Thursday, February 10, 2011, 15:42 [IST]
English summary
The second coming of Peugeot Citroen into India will be marked with the launch of a new mid-sized sedan. The company has been in exile for the last ten years and the plans to re-enter into India has been on the cards since 2009. The delay in stepping into the country has been due to the thought of erecting fully localized manufacturing facility.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+