మైక్రా కన్నా తక్కువ ధరకు మరో చిన్న కారు: నిస్సాన్

Nissan Small Car
ప్రస్తుతం దేశీయ కొనుగోలుదారులు చిన్న కార్లపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతుండటంతో ప్రముఖ కార్ల తయారీ కంపెనీలన్నీ కూడా మార్కెట్లో పోటీని తట్టుకోవడం కోసం చిన్న కార్ల సెగ్మెంట్లోకి ప్రవేశించక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో టొయోటా, హోండా వంటి అగ్రగామి కంపెనీలు సైతం భారత మార్కెట్లోని కాంపాక్ట్ కార్ సెగ్మెంట్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పటికే తమ చిన్న కారు 'మైక్రా'తో భారత మార్కెట్లోకి ప్రవేశించిన జపాన్ ఆటో దిగ్గజం నిస్సాన్ మరో చౌక కారును దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

మారుతి ఆల్టో, చెవర్లే స్పార్క్, హ్యుందాయ్ శాంత్రో వంటి చిన్న కార్లకు ధీటుగా రూ. 2-4 లక్షల రేంజ్‌లో ఓ చిన్న కారును విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. "మైక్రాకు దిగువన ఓ చిన్న కారును విడుదల చేసేందుకు తీవ్రంగా అధ్యయనం చేస్తున్నాం. చిన్న కార్ సెగ్మెంట్లో చాలా గొప్ప అవకాశాలను మేము చూస్తున్నామ"ని నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ కిమినోబు టోకుయమా వెల్లడించారు.

మరోవైపు దేశీయ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్‌తో నిస్సాన్ జాయింట్ వెంచర్‌గా ఏర్పడి ఓ ఎమ్‌పివి (మల్టీ పర్పస్ వాహనం)ను అభివృద్ధి చేస్తోంది. టొయోటా ఇన్నోవాకు పోటీగా వస్తున్న ఈ ఎమ్‌పివి వచ్చే ఏడాది ఇది మార్కెట్లోకి రానుంది. కాగా.. గ్లోబల్ మార్కెట్లో నిస్సాన్ అందిస్తున్న తన ఫ్లాగ్‌షిప్ సెడాన్ 'సన్ని' కారును భారత మార్కెట్లో ఆవిష్కరించింది. వచ్చే పండుగ సీజన్ నాటికి సన్ని సెడాన్ వాణిజ్యపరంగా మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ తెలిపింది.

More from DriveSpark

Article Published On: Thursday, August 4, 2011, 11:01 [IST]
English summary
Japanese carmaker Nissan is working on a new small car with in the price tag of Rs 2-4 lakh. This new small car is likely to compete with Maruti's Alto, Chevrolet Spark and the Hyundai Santro. “We're seriously studying the launch of a small car below the Micra. We see great opportunity in the small car segment,” said Mr Kiminobu Tokuyama, MD and CEO, Nissan Motor India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+