భారత మార్కెట్లోకి ప్రవేశించనున్న కేటర్‌హామ్ కార్స్

Caterham Cars
బ్రిటీష్‌కు చెందిన మోటార్‌స్పోర్ట్స్ బ్రాండ్ "కేటర్‌హామ్ కార్స్" త్వరలోనే భారత్‌కు రానుంది. భారత్‌లో ఎఫ్ఎమ్‌జిసి కంపెనీ డాబర్‌ను ప్రమోట్ చేసిన బర్మన్స్ ద్వారా కేటర్‌హామ్ దేశీయ మార్కెట్లోకి కార్యకలాపాలు ప్రారంభించనుంది. కొనుగోలుదారుల ఆర్డర్ మేరకు ఈ 'కేటర్‌హామ్ సెవన్' కారును తయారుచేసి విక్రయిస్తారు.

వచ్చే సంవత్సరం మధ్య భాగం నాటికి ఈ కార్లు భారత్‌లో అందుబాటులోకి రానున్నాయి. దేశీయ మార్కెట్లో కేటర్‌హామ్ కార్ల ధరలు రూ.28 లక్షలు మొదలుకొని రూ.90 లక్షల వరకూ ఉండనున్నాయి. అంతేకాకుండా తమ లేటెస్ట్ స్పోర్ట్స్ కార్ 'ఎస్‌పి300'ను కూడా భారత్‌కు తీసుకు వచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

ఎస్‌పి300 స్పోర్ట్స్ కార్ ధర రూ.66,000 పౌండ్లు. భారతదేశం మొట్టమొదటి సారిగా ఫార్ములా వన్ రేస్‌కు ఆతిథ్యమిస్తున్న తరుణంలో, దేశీయ మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఇదే మంచి తరుణమని, మోటార్‌స్పోర్ట్స్‌తో ముడిపడి ఉన్న కేటర్‌హామ్ ఇక్కడి మోటార్‌స్పోర్ట్స్‌ ఔత్సాహికులకు మంచి అవకాశాలను ఇవ్వగలమని భావిస్తున్నామని కేటర్‌హామ్ కార్స్ మేనేజింగ్ డైరెక్టర్ అన్సార్ అలీ తెలిపారు.

More from DriveSpark

Article Published On: Friday, October 28, 2011, 12:35 [IST]
English summary
British motorsports brand Caterham Cars is entering India with the Burmans, promoters of FMCG company Dabur, at the helm of the operations here. The company will start selling its Caterham Seven, built- to-order models priced ranging from Rs 28 lakh up to Rs 90 lakh by the first half of next year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+