ఆల్టో జోరుకు చెక్ పెట్టేందుకు మహీంద్రా చిన్న కారు!

కాగా.. ఇదే సెగ్మెంట్లో దేశపు ద్వితీయ అగ్రగామి కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ కూడా ఓ 800 సీసీ కారును (హ్యుందాయ్ హెచ్ఏ లేదా హ్యుందాయ్ 800) విడుదల చేయనున్నట్లు సమాచారం. 2011 చివరి నాటికి హ్యుందాయ్ చిన్న కారు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ ఎమ్‌పివి, ఎస్‌యూవీ వంటి ప్యాసింజర్ వాహనాలతో పాటు వాణిజ్య వాహనాలను అందిస్తూ వచ్చిన మహీంద్రా అండ్ మహీంద్రా, తన ఫ్రెంచ్ భాగస్వామి రీనాల్ట్ వాటాలను కొనుగోలు చేసి లోగాన్ సెడాన్ కారును కొత్త హంగులు అద్ది మహీంద్రా బ్రాండ్ నేమ్‌తో వెరిటోగా మార్కెట్లోకి విడుదల చేయడంతో సెడాన్ సెగ్మెంట్లోకి కూడా ఎమ్ అండ్ ఎమ్ ప్రవేశించినట్లయింది.
ఈ సెడాన్‌కు దేశీయ మార్కెట్లో భారీ స్పందన రావడంతో మరిన్ని ఇతర సెగ్మెంట్లలోనూ తన ముద్ర వేసుకోవాలని మహీంద్రా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే 2013-14 నాటికి ఓ చిన్న కారును భారత మార్కెట్లోకి విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. మహీంద్రా తమిళనాడు ప్లాంటులో ఈ చిన్న కారును ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. దీని ధరకు ఇతర మోడళ్లకు పోటీ ఇచ్చే విధంగా రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కోసం మహీంద్రా అండ్ మహీంద్రా రూ. 800 కోట్లను వెచ్చించనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications








