ఎక్సైజ్ బెనిఫిట్ కోసం సబ్ కాంపాక్ట్ వెరిటోను ప్రవేశపెట్టనున్న మహీంద్రా

లోగాన్ కారుకు మహీంద్రా మార్పులు చేర్పులు చేసి వెరిటోగా పేరు మార్చి మార్కెట్లోకి ప్రవేశపెట్టినప్పటి నుండి ఈ మోడల్ అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ బెనిఫిట్ కోసం ఈ మోడల్‌లో నాలుగు మీటర్ల పొడవు కన్నా తక్కువగా ఉండే వెరిటోను రూపొందించనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. అలాగే, ఈ మోడల్‌లో ఓ ప్రీమియం వెరిటోను కూడా మహీంద్రా విడుదల చేయనుంది.
నాలుగు మీటర్లు అంతకన్నా పొడవు ఉన్న కార్లను పెద్ద కార్లుగా పరిగణించి అధిక ఎక్సైజ్ సుంఖాన్ని (22 శాతం) వసూలు చేస్తారు. నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవున్న కార్లను కాంపాక్ట్ (చిన్న) కార్లుగా పరిగణించి తక్కువ ఎక్సైజ్ సుంఖాన్ని (10 శాతం) వసూలు చేయడం జరుగుతుంది. మహీంద్రా చిన్న కారు మరో ఆరు నుంచి ఎనిమిది నెలల్లో మార్కెట్లోకి విడుదలయ్యే ఆస్కారం ఉంది. దీని ధర కూడా ప్రస్తుతం ఉన్న వెరిటో కన్నా తక్కువగా ఉండబోతుంది.


Click it and Unblock the Notifications








