టాటా నానోలో కొత్త వేరియంట్: వచ్చే నెలలో విడుదల

Tata Nano
ఇప్పటికైనా టాటా మోటార్స్ తెలుసుకుంది. కంపెనీ అందిస్తున్న చవక కారులో టాటా నానోకు అదన ఫీచర్లు జోడించి కాస్మోటిక్ మార్పులు చేసి సరికొత్త లుక్‌తో మార్కెట్లోకి విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. గడచిన కొద్ది నెలలుగా టాటా నానో అమ్మకాలు ఆశించినంతగా సాగకపోతుండటంతో ఇందులో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించింది.

మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం కొత్త టాటా నానో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ వచ్చే నెలలో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తుంది. మార్చి 2009లో విడుదలై టాటా నానోను కంపెనీ అప్‌గ్రేడ్ చేయడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఉన్న టాటా నానోతో పోల్చుకుంటే 10 శాతం అధిక శక్తివంతమైన ఇంజన్ కొత్త ఫేస్‌లిఫ్ట్ టాటా నానోలో ఉండనుంది. దీని మైలేజ్ కూడా ఎక్కువగా ఉండొచ్చని అంచనా.

ఇంకా, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్లలో కూడా కాస్మోటిక్ మార్పులు ఉండనున్నాయి. సరికొత్త టాటా నానోలో కొత్త ఫ్యాబ్రిక్ సీట్లు, ఫ్రంట్ సీట్లపై కొత్త హెడ్‌రెస్ట్, బీగీ కలర్ డ్యాష్‌బోర్డ్, ప్యాసింజర్ వైపు అమర్చిన రియర్ వ్యూ మిర్రర్, కొత్త వీల్ క్యాప్ డిజైన్ వంటి మార్పులు చోటు చేసుకోనున్నాయి. అంతేకాకుండా ఇది పెరల్ వైట్, ఆరెంజ్, గ్రీన్ వంటి ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యం కానుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, November 16, 2011, 16:33 [IST]
English summary
The Tata Nano is getting a much needed facelift. The new Nano wil be getting several new features along with a cosmetic facelift. The new face-lifted Nano has already reached showrooms and an announcement can be expected soon.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+