అప్‌గ్రేడెడ్ '2012 సిఆర్-వి'ని విడుదల చేయనున్న హోండా!

ఈ పరిణామాలను గుర్తించిన కంపెనీ హోండా సిఆర్-వికు ఆధునిక మెరుగులు అప్‌గ్రేడెడ్ సిఆర్-వి 2012 మోడల్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న మార్కెట్ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది ఈ కొత్త మోడల్‌ను విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే ఈ వాహనానికి సంబంధించి అప్‌డేట్‌లను అందించేందుకు కంపెనీ ఓ మైక్రో సైట్‌ను కూడా లాంచ్ చేసింది. ఈ మైక్రో సైట్ ప్రకారం, కొత్త 2012 సిఆర్-వి ఎక్స్టీరియర్స్‌లోను అలాగే ఇంటీరియర్స్‌లోనూ అనేక మార్పులు చేసే అవకాశం ఉంది.
ఇంకా, ఇందులో ఎన్నో కొత్త అడ్వాన్స్‌డ్ ఫీచర్లను కూడా హోండా జోడించనుంది. గడచిన ఐదేళ్లుగా హోండా సిఆర్-వి అధికంగా అమ్ముడయ్యే కారుగా ఉండటంతో కొత్తగా రానున్న మోడల్‌పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. దీని ఇంజన్‌లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంది. 2012 సిఆర్-వి ఎస్‌యూవీ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో 185-210 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుందని, పాత మోడల్‌తో పోల్చుకుంటే ఇది మైలేజ్ అధికంగా ఉండటమే కాకుండా, బరువు కూడా తక్కువగా ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








