ఆటోమొబైల్స్, విడిభాగాలపై దిగుమతి సుంఖంలో కోత విధించండి

Ratan Tata
టాటా గ్రూపు సంస్థల రతన్ టాటా ఆటోమొబైల్స్, విడిభాగాలపై దిగుమతి సుంఖంలో కోత విధించాలని కోరారు. ఓవైపు ఇండియా-ఈయూ ఉచిత వాణిజ్య ఒప్పందాన్ని (ఫ్రీ ట్రేడ్ అగ్రిమెట్) యావత్ భారత్ ఆటోమొబైల్ పరిశ్రమ వ్యతిరేకిస్తుంటే రతన్ టాటా మాత్రం దాన్ని స్వాగతించారు. వాస్తవానికి ఈ ఒప్పందం కారణంగా యూరోపియన్ యూనియన్ దేశాల్లో తయారైన ఉత్పత్తులను భారత్‌కు దిగుమతి చేసుకునేటప్పుడు వాటిపై తక్కువ దిగుంతి సుంఖం ఉంటుంది, ఫలితంగా సదరు ఉత్పత్తులు భారతదేశంలో తక్కువ ధరకే లభిస్తాయి. ఇది దేశీయ కంపెనీలపై, ముఖ్యంగా ఆటోమొబైల్ కంపెనీలపై తీవ్ర ప్రభావాలను చూపుతాయనే భయంతో, ఈ ఒప్పందాన్ని భారత ఆటోమొబైల్ పరిశ్రమ వ్యతిరేకిస్తోంది.

ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ జెడి పవర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రతన్ టాటా మాట్లాడుతూ.. ఇలాంటి అధిక దిగుమతి సుంఖాలు సరికాదని, ఇవి స్థానిక కంపెనీల రక్షణకు కృత్రిమ ఆటంకాలు కలిగిస్తాయని చెప్పారు. భారత్‌లో ఆటోమొబైల్ పరిశ్రమ లేదని, ఇక్కడ కేవలం విదేశీ బ్రాండ్‌లను అసెంబ్లింగ్ చేసే వారు మాత్రమే ఉన్నారని చెప్పారు. వాస్తవానికి మహీంద్రా అండ్ మహీంద్రా మరియు టాటా మోటార్స్ మాత్రమే దేశంలో ఉత్పత్తులను అభివృద్ధి, తయారీలను చేస్తున్నాయని తెలిపారు. అధిక ఇంపోర్ట్ డ్యూటీ రేట్లను తగ్గించాలని రతన్ టాటా అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం పూర్తిగా విదేశాల్లోనే తయారైన వాహనాలపై 60 శాతం కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది. అది ఇండియాకు వచ్చే సరికి సేల్స్ టాక్స్, వ్యాట్, ఇతర ట్యాక్స్‌లను కలుపుకొని 100 శాతం అవుతుంది. అదే విడిభాగాలను భారత్‌కు తెచ్చుకొని ఇక్కడ అసెంబ్లింగ్ చేస్తే ఇంపోర్ట్ డ్యూటీ తగ్గుతుందే. ఇంజన్, ట్రాన్సిమిషన్, గేర్‌బాక్స్‌లపై భారత ప్రభుత్వం 30 శాతం దిగుమతి సుంఖాన్ని, ఇతర స్పేర్ పార్ట్‌లపై 10 శాతం దిగుమతి సుంఖాన్ని వసూలు చేస్తుంది. అందుకే విదేశీ కంపెనీలన్నీ కూడా తమ వాహనాలను ఇక్కడే అసెంబ్లింగ్ చేసేందుకు భారత్‌కు క్యూ కడుతున్నాయి. ఫలితంగా దేశీయ కంపెనీలు ఫారిన్ కంపెనీల నుండి ఎదురయ్యే పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, June 13, 2011, 18:18 [IST]
English summary
Tata group chairman Ratan Tata expressed concern over high import duties. In an interview with market research firm JD Power, Tata said such high import duties are unrealistic and create an artificial barrier of protection for local companies. has favored cutting tariff on vehicles and components coming from overseas.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+