తక్షణ డెలివరీ కావాలా... అయితే బ్లాక్ మార్కెటే శరణ్యం

సరే అసలు విషయానికి వస్తే... డబ్బుకు ఆశపడుతున్న కొందరు వాహన డీలర్లు.. సాధారణంగా వాహనం పొందాలంటే కనీసం ఒకటి రెండు ఆగాల్సి వస్తుందని, కానీ అదనంగా డబ్బులు చెల్లిస్తే మాత్రం తక్షణమే డెలివరీ లభిస్తుందని ఊదరగొడుతూ.. వినియోగదారుల జేబులు కొల్లగొడుతున్నారు. ఏజెంట్లు, డీలర్లు ఈ విధమైన అసత్య ప్రచారాలు చేస్తూ.. కృత్రిమ వాహన కొరతను సృష్టిస్తున్నారు. వాస్తవానికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉండే వాహనాలను కొనుగోలు చేయాలంటే ఒక నెల ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం వాహన డెలివరీ కాస్త ఆలస్యం కూడా కావచ్చు. అంతే కానీ.. దేశంలో తయారయ్యే వాహనాల డెలివరీకి అధిక సమయం పట్టకపోవచ్చు.
పై పెచ్చు ఆటోమొబైల్ కంపెనీలు కూడా మార్కెట్ డిమాండుకు అనుగుణంగా ఉత్పత్తిని చేపట్టడం జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో డెలివరీ కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉంటుందా...! కాబట్టి వినియోగదారులారా... వాహనం కొనేటప్పుడు డీలర్ చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మకుండా.. కాస్తంత మెళకువ వహించండి. అలా ఎవరైనా నమ్మబలికితే రెండు, మూడు డీలర్‌షిప్ కేంద్రాలలో డెలివరీ సమయాన్ని, వాహన ధరలను సరిపోల్చుకు చూడండి. అప్పటికీ నమ్మకం కుదరకపోతే నేరుగా వాహన తయారీదారులతో ఫోన్లో కానీ, ఈమెల్ ద్వారా కానీ సంప్రదించి సరైన సమాచారాన్ని తెలుసుకోండి.


Click it and Unblock the Notifications








