స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పురాతన వాహనాల ప్రదర్శన

Old Cars Show
గడచిన 15వ తేదీన భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని డెక్కన్ హెరిటేజ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సచివాలయానికి సమీపంలో ఉన్న పీపుల్స్ ప్లాజాలోని లుంబిని గార్డెన్‌లో 'వింటేజ్ ఆటోమొబైల్ ఎగ్జిబిషన్'ను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంతో మంది ఔత్సాహికులు తమ వద్ద ఉన్న పురాతన కార్లను మరియు మోటార్ సైకిళ్లను ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. వీటంన్నింటినీ చూస్తుంటే.. స్వాతంత్ర్యోద్యమం నాటి రోజులు మనకు గుర్తుకు వస్తాయి.

వీటిల్లో 1918 సంవత్సరం నుంచి 1970 సంవత్సరం మధ్య కాలంలో తయారైన వాహనాలు కూడా ఉన్నాయి. 1920వ సంవత్సరానికి చెందిన బేబీ ఆస్టియన్, 1930వ సంవత్సరానికి చెందిన చెవర్లెట్, డాగ్జ్, ఫోర్డ్ టి మోడల్, మొర్రీస్ కన్వర్టబుల్, మొర్రీస్ మైనర్, 1950వ సంవత్సరం నాటి ఫియట్ -1100 మోడల్ కార్లతో పాటుగా పురాతన రాయల్ ఎన్‌ఫీల్డ్ , నార్టాన్, బ్రిటీష్ కాలం నాటి ట్రైయంప్ మరియు బిఎస్ఏ, ఏజేఎస్ వంటి ఎన్నో మోటార్‌సైకిళ్లను కూడా ప్రదర్శనకు ఉంచారు.

More from DriveSpark

Article Published On: Wednesday, August 17, 2011, 13:16 [IST]
English summary
Deccan Heritage has organized 'Vintage Automobiles Exhibition' at Lumbini Park in People Plaza, Hyderabad on 15th August 2011 as a part of Independence day celebrations. Its recalled old Indian historical movements.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+