ఢిల్లీ హైకోర్ట్ బ్లాస్ట్ - తీవ్రవాదులు వాడిన కారు గుర్తింపు!?

Hyundai
యావత్ దేశాన్ని కలవరానికి గురి చేసిన ఢిల్లీ హైకోర్టు బాంబు పేలుళ్ల సంఘటనకు తీవ్రవాదులు ఉపయోగించిన కారు కోసం పోలీసులు ఇప్పుడు గాలింపులు ప్రారంభించారు. ఈ పేలుడును ప్లాన్ చేసేందుకు తీవ్రవాదులు హ్యుందాయ్ శాంత్రో కారును కానీ లేదా హ్యుందాయ్ ఐ10 కారును కానీ ఉపయోగించి ఉంటారని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తాము ఓ రిజిస్టర్ నెంబర్‌ను ట్రేస్ చేశామని, అయితే ఫేక్ నెంబర్ అయి ఉండొచ్చని భావిస్తున్న పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కాగా.. ప్రముఖ ఆంగ్ర పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన కథనం ప్రకారం, తీవ్రవాదాలు ఓ హ్యుందాయ్ యాక్సెంట్ సెడాన్ కారును ఉపయోగించారని, దాని రిజిస్ట్రేషన్ నెంబర్ డిఎల్9సిఏ 6034 అని ప్రచురించింది.

ఈ బ్లాస్ట్‌ కోసం తీవ్రవాదులు పిఈటిఎన్ (పెంటాఎర్తిరిటాల్ ట్రైనేట్రేట్) అనే నైట్రోజన్ ఆధారిత మిశ్రమాన్ని ఉపయోగించినట్లు ప్రాధమిక విచారణలో తేలింది. ఇది అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థం. ఈ పధార్థాన్ని మెటల్ డిటెక్టర్లు సైతం గుర్తించలేవు. 3-4 కిలోల బరువున్న ఈ పేలుడు పదార్థాన్ని కోర్టు ఎంట్రన్స్‌లోని రిసెప్షన్ సెంటర్ వద్ద ఉంచారు.

బుధవారం ఉదయం రద్దీ సమయం కావడంతో ప్రమాద స్థాయి తీవ్రంగా ఉంది. ఈ పేలుడు కారణంగా ఇప్పటి వరకూ 12 మంది మృతి చెందగా, సుమారు 75 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు హర్కత్-ఉల్-జిహాదీ ప్రకటించినప్పటికీ పలు ఇతర ఉగ్రవాద సంస్థలపై నిఘా వర్గాలు అనామానాలు వ్యక్తం చేస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, September 8, 2011, 15:09 [IST]
English summary
A day after the powerful bomb blast shook the Delhi High Court, the police is on a look out for a possible Santro or a Hyundai i 10 which they think could have been used by the suspects. According to sources the suspects could have possibly fled in the car after the blast. Police also claim that a fake registration number could have used been used in the case.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+