ఢిల్లీలో మరింత ప్రియం కానున్న డీజిల్ కార్లు..!!

మోటార్ వాహన పన్నుల చట్టం 2004 (మోటార్ వెహికల్ టాక్సేషన్ యాక్ట్)లోని షెడ్యూల్ 1 ప్రకారం.. డీజిల్ ఇంధనంగా పనిచేసే వాహనాలపై 25 శాతం అదనపు పన్నును విధిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. సిఎన్‌జి (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్)తో నడిచే వాహనాల కన్నా.. డీజిల్‌తో నడిచే వాహనాల నుంచి వెలువడే కాలుష్యం ఎక్కువగా ఉంటుందని ఆమె వివరించారు. భారత మార్కెట్లో కార్లకు ఢిల్లీ అతిపెద్ద మార్కెట్‌గా ఉండి ఏటా కొత్త వాహనాలకు 15 శాతం వాటా కలిగి ఉంది. ఇందులో 30 శాతం వాహనాలు డీజిల్‌తో నడిచేవే. వార్షికంగా దేశంలో ప్రతి ఏటా సగటున 8 లక్షల డీజిల్ వాహనాలు అమ్ముడవుతుంటాయి.
ఇప్పటికే ఢిల్లీలో సంచరిస్తున్న మారుతి స్విఫ్ట్, మాహీంద్రా స్కార్పియో, టాటా ఇండికా వంటి పలు మోడళ్లపై ఈ సవరించిన పన్ను విధానం ప్రభావం చూపవచ్చు. సాధారణంగా ఇతర ఇంధనాలతో నడిచే కార్ల కన్నా డీజిల్ కార్ల ధరలు అధికంగా ఉంటాయి. ఇందుకు చాలానే కారణాలున్నాయి. పన్ను విధింపులో 15 శాతం తేడా, డీజిల్ వాహనాలకు వాడే పరికరాలలో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం వంటి పలు కారణాల వల్ల డీజిల్ కార్ల ధరలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇలా ప్రత్యేకించి ఓ వర్గానికి చెందిన వాహనాలను లక్ష్యంగా చేసుకొని పన్నులు విధించడం సరికాదనేది మారుతి సుజుకి వాదన.
భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏమ్) కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది. డీజిల్‌ను డర్టీ ఫ్యూయెల్‌గా డిస్‌కార్డ్ చేయలేమని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కార్ల తయారీదారులపై తీవ్ర ప్రభావాలను చూపుతుందని, అలాగే వినియోగదారులు కూడా అధనపు భారాన్ని మోయాల్సి వస్తుందని పేర్కొంది. కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి మాత్రం బడ్జెట్‌లో సైకిళ్లకు ఊరట కలిగిస్తూ.. అవి కాలుష్య రహితమైనవని పైగా ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయని తెలిపారు.


Click it and Unblock the Notifications








