అంబాసిడర్ పోయి మారుతి ఎస్ఎక్స్4 వచ్చే టాం.. టాం..!!

SX4-Ambassador
దేశ రాజధానికి పోలీసులకు ఇప్పుడు బంపర్ ఆఫర్ లభించింది. ఇప్పటి వరకూ ఢిల్లీ పోలీసులు వాడుతున్న పాతకాలపు రాయల్ కారు అయిన అంబాసిడర్‌ను వదలి ఇకపై కొత్తగా వచ్చిన మారుతి సుజుకి ఎస్ఎక్స్4 వాహనాలలో వారు సంచరించనున్నారు. రవాణా వ్యవస్థ అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లో అంబాసిడర్ కారుకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. మరి ఇప్పటి వేగాన్ని అప్పటి కార్లలో అందుకోవాలంటే కొంచెం కష్టమైన విషయమే. అందుకే.. అంబాసిడర్ కార్ల స్థానంలో ఆదునిక కార్లను ఉపయోగించాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు.

ఇంధనాన్ని ఆదా చేయడంతో పాటు వేగంగా పనులను పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్ల కొనుగోలు ప్రక్రియను ప్రారభించామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బికె గుప్తా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఓ ప్రతిపాదనను చాలా కాల క్రితమే కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ముందు ఉంచగా.. దానికి తాజాగా ఆమోదం లభించింది. ఇంధనం, స్పీడ్, మెయింటినెన్స్ ఖర్చు, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని అంబాసిడర్ కార్ల స్థానంలో ఈ కార్లను రీప్లేస్ చేస్తున్నామని కమిషనర్ వెల్లడించారు.

ఇప్పటికే 12 మారుతి సుజుకి ఎస్ఎక్స్4 కార్లను ఢిల్లీ పోలీసులకు అందించడం కూడా జరిగింది. కొత్త ఎస్ఎక్స్4 కార్లలో భద్రతా కారణల కోసం ప్రత్యేకంగా రేడియో ట్యాగ్‌లను బిగించబడి ఉంటాయి. పోలీసు కార్లనగానే అంబాసిడర్ కార్లే గుర్తుకు వచ్చేవి. ఒకప్పటి స్టేటస్ సింబల్ అయిన అంబాసిడర్ కారు ఇప్పుడు పోలీసులకు కూడా పనికిరాకుండా పోతుంది. ఏదేమైనప్పటికీ అంబాసిడర్ కార్లలో ఉన్న రాజసం ఈ కాలపు కార్లతో వస్తుందా..!

More from DriveSpark

Article Published On: Saturday, March 12, 2011, 17:24 [IST]
English summary
Delhi Police has decided to replace its current fleet of Ambassador cars with Maruti Suzuki's latest model SX4. In view of fuel efficiency, low maintenance cost, speed & comfort reasons they are decided replace the Hindustan Motor Ambassador cars with Maruti Suzuki SX4.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+