టాటా మోటార్స్ వినియోగదారుల కోసం 'టాటా డిలైట్' పథకం

Tata Delight
వినియోగదారులను వినూత్న పథకాలతో ఆకట్టుకోవడంలో తనదైన శైలిని కనబరిచే టాటా మోటార్స్ మరో సరికొత్త స్కీమ్‌ను పరిచయం చేసింది. వాణిజ్య వాహన యజమానుల కోసం టాటా మోటార్స్ "టాటా డిలైట్" అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా టాటా వాణిజ్య వాహనాలను కొనుగోలు చేసే వినియోగదారులకు వివిధ రకాల సేవలపై సబ్సిడీలు అందించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న టాటా మోటార్స్ డీలర్‌షిప్‌లు, సేల్స్ అవుట్‌లెట్లు, ఆథరైజ్డ్ సర్వీస్ స్టేషన్లలో వినియోగదారులు ఈ సేవలను పొందవచ్చు.

ఈ స్కీమ్‌లో భాగంగా వాణిజ్య కొనుగోలు చేసే వినియోగదారులకు బోనస్‌ పాయింట్లను ఇవ్వనున్నట్లు టాటా మోటార్స్‌ కమర్షియల్‌ వెహికిల్‌ విభాగం ప్రెసిడెంట్‌ రవి పిషరోడి తెలిపారు. డీలర్‌‌షిప్స్‌, సేల్స్‌ అవుట్‌లెట్స్‌, సర్వీసింగ్‌ సెంటర్లలో వాహనాల మరమ్మత్తులు, విడిభాగాల కొనుగోళ్ళపై కూడా బోనస్ పాయింట్లు లభిస్తాయని ఆయన వివరించారు. టాటా డిలైట్‌లో ప్రతి మూడు నెలలకు ఒకసారి తీసే లక్కీ డ్రాలో నానో కారును సొంతం చేసుకోవచ్చని రవి తెలిపారు.

అంతేకాకుండా టాటా మోటార్స్ నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆహ్వానాలు, పిల్లకు ఎడ్యుకేషనల్ స్కాలర్‌షిప్స్ టాటా డిలైట్ ద్వారా పొందవచ్చు. టాటా డిలైట్‌లో సభ్యత్వం తీసుకున్న వారికి మూడు లక్షల రూపాయల వరకూ బీమా కవరేజ్ ఉంటుంది. టాటా డిలైట్ సభ్యత్వంను కేవలం రూ. 100 (ఇన్సూరెన్స్ లేకుండా) మరియు రూ. 500 (ఇన్సూరెన్స్‌తో కలిపి)కే అందిస్తున్న రవి పేర్కొన్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, May 18, 2011, 13:45 [IST]
English summary
For commercial vehicle-owners, Tata Motors has launched customers’ loyalty programme named Tata Delight that offers a host of facilities. Adding, Tata Delight is a loyalty programme for the company's commercial vehicle customers, both existing and new. It provides a host of distinctive facilities across all Tata Motors dealerships, sales outlets and authorized service stations.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+