పెట్రో బూచి: గణనీయంగా పెరిగిన డీజిల్ కార్ల డిమాండ్

తాజా గణాంకాలను బట్టి గమనిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డీజిల్ కార్ల విక్రయాలు అమాంతం 22 శాతానికి పెరిగిపోయాయి. అదే పెట్రోల్ కార్ల అమ్మకాలను గమనిస్తే, అవి 14 శాతానికి పడిపోయాయి. పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలో లభ్యమయ్యే మోడళ్లను గమనిస్తే, పెట్రోల్ మోడల్ కన్నా డీజిల్ మోడల్ అమ్మకాలు 80 శాతం వరకూ పెరిగాయి.
ప్రస్తుతం మారుతి సుజుకి పెట్రోల్ వేరియంట్ ఒకటి రెండు నెలల వెయిటింగ్ పీరియడ్ సమయంలోనే సొంతమవుతుంటే, డీజిల్ వేరియంట్ కోసం మాత్రం 8-10 నెలలు వేచి ఉండాల్సి వస్తుంది. హ్యుందాయ్ వెర్నా, చెవర్లే బీట్, టొయోటా ఎతియోస్, ఫోర్డ్ వంటి డీజిల్ వేరియంట్ల డెలివరీ పీరియడ్ కూడా పెట్రోల్ వేరియంట్ల వెయిటింగ్ పీరియడ్‌తో పోలిస్తే కాస్తంత అధికంగానే ఉంది.


Click it and Unblock the Notifications