పెట్రో మంట: ఊపందుకున్న ఇంధన సామర్థ్య కార్ల డిమాండ్

సీఎన్‌జీ వేరియంట్లకు పెరుగుతున్న డిమాండును దృష్టిలో ఉంచుకొని దేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ఐదు పెట్రోల్ కార్లను సీఎన్‌జీ-ఇంటిగ్రేటెడ్ ఇంజెక్టర్స్‌తో గత నవంబర్‌లో విడుదల చేసింది. ఎస్ఎక్స్4, ఆల్టో, వ్యాగన్ఆర్, ఎస్టిలో మరియు ఈకో వాహనాల్లో ఈ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఇంకా హ్యుందాయ్ అసెంట్, జిఎమ్ ఏవియో, టొయోటా ఇన్నోవా మరియు కరోలా, టాటా ఇండికా మరియు ఇండిగో మోడళ్లలో సిఎన్‌జి వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, సీఎన్‌జీ వాయువు కొన్ని ప్రధాన నగరాలు మాత్రమే పరిమితం కావడంతో ఈ వేరియంట్లు దేశవ్యాప్తంగా అందుబాటులో లేవు. ఢిల్లీ, ముంబై, ఆగ్రా మరియు గుజరాత్‌ససో మాత్రమే ఈ చౌక ఇంధనం లభిస్తోంది.
మారుతి తన ఇతర మోడళ్లలో కూడా సీఎన్‌జీ వేరియంట్లను ప్రవేశపెట్టాలని భావిస్తుండగా.. జనరల్ మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ మోడల్ బీట్‌లో సీఎన్‌జీ ఫ్లాట్‌ఫామ్‌ను ఉపయోగించాలని భావిస్తోంది. సాధారణంగా పెట్రోల్ వేరియంట్ మారుతి ఎస్ఎక్స్4 కారు ప్రతి కి.మీ. రూ. 4.40 ఖర్చు అయితే డీజిల్ వేరియంట్ ఎస్ఎక్స్4 ప్రతి కి.మీ. రూ. 2.40 ఖర్చు అవుతుంది, అదే సీఎన్‌జీ వేరియంట్ ఎస్ఎక్స్4 విషయానికి వస్తే.. ప్రతి కి.మీ. కేవలం 1.50 మాత్రమే ఖర్చు అవుతుంది. దీంతో చౌక ధర ఇంధనంతో నడిచే కార్లవైపే వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు.


Click it and Unblock the Notifications








