కేంద్ర బడ్జెట్ అనంతరం మరింత ప్రియం కానున్న కార్ల ధరలు

కానీ ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే.. ప్రభుత్వం తన వడ్డింపులు కొనసాగించినట్లయితే మరోసారి కార్ల ధరలకు రెక్కలు రావడం ఖాయమని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరీ ముఖ్యంగా డీజిల్ కార్ల ధరలు పెరగవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో అంతర్జాతీయంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇండియా ప్రభుత్వం వివిధ సుంకాలు, పన్నులను తగ్గించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ పన్నులను ప్రస్తుత బడ్జెట్‌లో కేంద్రం ఉపసంహరించుకునే వీలుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ దేశాల కంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ త్వరితగతిన కోలుకునేందుకు వీలుగా ప్రభుత్వం వివిధ రంగాలకు ప్రోత్సాహకాలను, ఉద్దీపన పథకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఇండియా ఇతర దేశాల కంటే వేగంగా ఆర్థిక సంక్షోభ పరిస్థితులనుంచి బయటపడి ఆర్థిక వృద్ధిరేటు సాధిస్తుండటంతో ఉద్దీపనలు ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
గతంలో ఎన్నడూలేని విధంగా 2010లో వాహన అమ్మకాలు జరగడంతో దేశం ఆర్థంగా కోలుకోవడం వల్లనే ఆటోమొబైల్ రంగం ఈ వృద్ధి సాధించగలిగిందని ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. మరోవైపు బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని, దిగుమతి సుంకాలను సవరించే అవకాశాలు ఉన్నాయనే వాదనలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి కూడా ఉద్దీపనలను ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రభుత్వానికి సూచించింది. ఇదే గనుక జరిగితే ఇకపై కార్లు ధరలు నేలపై కాకుండా గాల్లో ప్రయాణించే ఆస్కారం ఉందని అటు ఆటోమొబైల్ కంపెనీలు, ఇటు వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.


Click it and Unblock the Notifications








