వచ్చే నెల నుంచి మరింత ప్రియం కానున్న డీజిల్, ఎల్‌పిజి!?

Diesel Cars
పెట్రోల్‌ను సబ్సిడి ధరకే విక్రయిస్తుండటం వల్ల నష్టాల్లో కూరుకుపోతున్నామంటూ గత రెండు వారాల క్రితం చమురు కంపెనీలు లీటరు పెట్రోల్‌ ధరపై ఒక్కసారిగా ఐదు రూయాపాలు పెంచాయి. ఇప్పుడు డీజిల్ వంతు వచ్చింది. డీజిల్, ఎల్‌పిజి మరియు కిరోసిన్ ధరలను ప్రభుత్వం నియంత్రిస్తుడటంతో.. అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే భారత్‌లో తక్కువ ధరలకే వీటిని విక్రయిస్తున్నందున ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రతి రోజూ రూ. 500 కోట్లకుపైగా నష్టాలను చవిచూస్తున్నాయని చమురు శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతి లీటచరు డీజిల్‌పై రూ. 16.49, ప్రతి 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ విక్రయంపై రూ. 329.73 మరియు ప్రతి లీటరు కిరోసిన్ విక్రయంపై రూ. 29.69లను కంపెనీలు నష్టపోతున్నట్లు వారు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఇటీవల సమావేశమైన కేంద్ర మంత్రుల సాధికార బృందం డీజిల్ ధరలను యధావిథంగా ఉంచింది. అయితే తాజాగా.. డీజిల్, ఎల్‌పిజి మరియు కిరోసిన్ ధరలను సమీక్షించేందుకు కేంద్ర ఆర్థకమంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆద్వర్యంలోని మంత్రుల సాధికారిక బృందం మరోసారి జూన్ 9న సమావేశం కానుందని చమురు మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరు పెరుగుతున్నందున డీజిల్, ఎల్‌పిజి మరియు కిరోసిన్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని, డీజిల్ ధరపై రూ. 4 పెంపును, వంట గ్యాస్‌ సిలిండర్‌పై రూ. 20-25 మేర పెంపును విధించే అవకాశం వారు ఉందని తెలిపారు. కిరోసిన్ పెంపు అంశం కూడా పరిశీలనలో ఉంది. ఈసారి ధరల పెంపు ఖచ్చితమని పరిశ్రమ వర్గాలు కూడా భావిస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, May 26, 2011, 17:39 [IST]
English summary
After petrol, price of diesel, LPG and kerosene are likely to go up from next month according to oil ministry officials. "The Empowered Group of Ministers (EGoM) has been scheduled to meet on June 9," the official said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+