ఫియట్ ఇండియా - టాటా మోటార్స్‌ల మధ్య సవతిపోరు

Tata-Fiat
భాగస్వామ్య వ్యాపారాలు మొదట్లో బాగానే సాగినా తర్వాతి కాలంలో వివిధ కారణాల వల్ల విడిపోవడం సహజమే.. ఆటోమొబైల్ రంగంలో నానాటికీ పెరుగుతున్న పోటీ, అందివస్తున్న అవకాశాలు, మరీ ముఖ్యంగా భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందడానికి ఉన్న అన్నిరకాల మౌలిక సదుపాయాలు వంటి పలు కారణాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని కంపెనీలు తమ కార్యకలాపాలను సొంతంగానే నిర్వహించుకోవాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్-జపాన్ దేశాలకు చెందిన జాయింట్ వెంచర్ హీరోహోండా, భారత్-ఫ్రెంచ్ దేశాలకు చెందిన మహీంద్రా-రీనాల్ట్ (లోగాన్ కారు తయారీదారుల) జాయింట్ వెంచర్‌లు రద్దు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా.. ఈ జాబితాలోకి టాటా మోటార్స-ఫియట్ ఇండియా కంపెనీలు కూడా చేరిపోనున్నాయి. ఫియట్ ఇండియా తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు టాటా మోటార్స్‌తో 2007లో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం టాటా షోరూమ్‌లలో ఫియట్ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచడంతో పాటు విక్రయించడం జరుగుతుంది. అయితే.. దీనివల్ల ఫియట్ విక్రయాలపై పెద్దగా ప్రభావం లేకపోవడం, వినియోగదారులు తొలుత టాటా వాహనాలకే ఆకర్షితులు కావడం వంటి కారణాల వల్ల ఫియట్ తమ వాహనాలను తామే సొంతంగా మార్కెటింగ్ చేసుకోవాలని భావిస్తుంది. మరి ఫియట్ ప్రయత్నాలు ఎంతవరకూ విజయవంతమవుతాయో.. వినియోగదారులే నిర్ణయించాలి.. ఏదైతేనేం మనమూ ఫియట్‌కు అల్ ది బెస్ట్ చెబుదాం.

More from DriveSpark

Article Published On: Wednesday, February 16, 2011, 16:23 [IST]
English summary
Ever since its tie up with Tata Motors, Fiat India has been struggling to deliver the goods to the customers. All these period of its JV, Fiat has been receiving only little returns failing to meet the demands and expectations of the customers. Hence the company is now detaching its tie with Tata so as to install its own ventures for marketing its brands in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+