24 నెలల తర్వాత మళ్లీ ఒక అంకెకు పడిపోయిన కార్ సేల్స్

Domestic Car Sales
పెరుగుతున్న ఇంధన ధరలు, అధిక వడ్డీ రేట్లు కారణంగా కార్ల ధరలు పెరిగి అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న రెండో ఆటోమొబైల్ మార్కెట్ భారత్‌లో మే నెలలో దేశీయ ప్యాసింజర్ కార్ల అమ్మకాలు కేవలం 7 శాతం మాత్రమే పెరిగి 1,58,817 యూనిట్లుగా నమోదయ్యాయి. మే 2010లో మొత్తం దేశీయ కార్ల అమ్మకాలు 1,48,425 యూనిట్లుగా ఉన్నట్లు భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం వెల్లడి చేసిన గణాంకాలు వివరిస్తున్నాయి.

మే 2009 నుంచి ఇదే అత్యల్ప వృద్ధి రేటని ఎస్ఐఏఎమ్ సీనియర్ డైరెక్టర్ సుగతో సేన్ తెలిపారు. జూన్ 2009లో భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఒక అంకె వృద్ధిని (8.23%) వృద్ధిని కనబరిచింది, ఆ తర్వాత మళ్లీ మే 2011లోనే ఒక అంకె వృద్ధిని కనబరిచిందని ఆయన తెలిపారు. అంటే 24 నెలల వరకూ భారత ఆటో పరిశ్రమ రెండంకెల వృద్ధిని కొనసాగించిదన్నమాట.

ఇకపోతే మే 2011 నెలలో మోటార్‌సైకిల్ అమ్మకాలు 14.33 శాతం పెరిగి 8,29,255 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరంలో ఇదే మోటార్‌సైకిల్ సమయానికి విక్రయాలు 7,25,311 యూనిట్లుగా ఉన్నాయి. అలాగే మొత్తం ద్విచక్ర వాహన అమ్మకాల విషయానికి వస్తే (మోటార్‌సైకిల్ మరియు స్కూటర్లను కలిపి) అవి మే 2011లో 14.49 శాతం వృద్ధితో 10,72,287 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో ఇవి 9,36,555 యూనిట్లుగా ఉన్నాయి.

వాణిజ్య వాహనాల అమ్మకాలను పరిశీలిస్తే.. మే నెలలో ఇవి 16.16 శాతం వృద్ధి చెంది 48,479 యూనిట్ల నుంచి 56,314 యూనిట్లకు పెరిగాయి. మొత్తమ్మీద అన్ని వాహన విభాగాలను కలిపి పరిశీలిస్తే.. ఇవి 13.40 శాతం వృద్ధిని సాధించి 13,70,786 యూనిట్లుగా రికార్డ్ అయ్యాయి. మే 2010లో ఇవి 12,08,820 యూనిట్లుగా ఉన్నట్లు ఎస్ఐఏఎమ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, June 9, 2011, 15:26 [IST]
English summary
According to figures released by the Society of Indian Automobile Manufacturers (SIAM) today, Domestic passenger car sales posted the slowest growth in 24 months in May this year at 7 per cent as rising fuel prices and interest rates discouraged customers from new purchases.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+