తగ్గిన కార్ల జోరు.. ఆగని ద్విచక్ర వాహనాల పరుగు..

గడచిన ఆగస్టు నెలలో మొత్తం దేశీయ కార్ల అమ్మకాలు 10.08 శాతానికి పడిపోతే, ద్విచక్ర వాహ అమ్మకాలు మాత్రం 16.1 శాతం పెరిగాయి. ఆగస్టు 2011లో మొత్తం దేశీయ కార్ల అమ్మకాలు 144,516 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలానికి ఇవి 160,713 యూనిట్లుగా ఉన్నట్లు ఎస్ఐఏఎమ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత నెలలో మొత్తం దేశీయ ద్విచక్ర వాహన అమ్మకాలు 16.1 శాతం పెరిగి 11,11,340 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయానికి ఇవి 957,236 యూనిట్లుగా ఉన్నాయి.
ఇకపోతే మొత్తం దేశీయ మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 15.43 శాతం పెరిగి 839,772 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఈ అమ్మకాలు 727,542 యూనిట్లుగా ఉన్నాయి.
ఇక మొత్తం దేశీయ వాణిజ్య వాహనాల అమ్మకాల విషయానికి వస్తే.. గతేడాది ఆగస్టు నెలతో పోలిస్తే 22.62 శాతం వృద్ధి చెంది 52,394 యూనిట్ల నుంచి 64,248 యూనిట్లకు పెరిగాయి.
అన్ని వాహన విభాగాలను కలిపి చూస్తే.. ఆగస్టు 2011లో మొత్తం అమ్మకాలు 11.85 శాతం పెరిగి 12,63,239 యూనిట్ల నుంచి 14,12,945 యూనిట్లకు పెరిగినట్లు ఎస్ఐఏఎమ్ పేర్కొంది.


Click it and Unblock the Notifications








