తగ్గిన దేశీయ కార్ల అమ్మకాలు, పెరిగిన బైక్‌ల అమ్మకాలు

Cars and Bike Sales
తారాజువ్వల్లా నింగికి ఎగస్తున్న వడ్డీ రేట్లు, ఇంధన ధరలు మరియు ముడి సరుకుల ధరలు ఆటోమొబైల్ రంగాన్ని ఆందోళనలో పడేలా చేస్తున్నాయి. గడచిన జులై నెలలో దేశీయ కార్ల అమ్మకాలు 15.76 శాతం పడిపోయి గతేడాది ఇదే నెలతో పోలిస్తే 1,58,767 యూనిట్ల నుంచి 1,33,747 యూనిట్లకు పడిపోయాయి. అయితే, ద్విచక్ర వాహనాల అమ్మకాలు మాత్రం పెరగడం విశేషం.

భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, జులై 2011లో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 10.51 శాతం వృద్ధి గతేడాది ఇదే నెలతో పోలిస్తే 7,10,621 యూనిట్ల నుంచి 7,85,278 యూనిట్లకు పెరిగాయి. ఇదే కాలానికి మొత్తం ద్విచక్ర వాహన అమ్మకాలను గమనిస్తే.. అవి 12.61 శాతం వృద్ధి చెంది 9,38,514 యూనిట్ల నుంచి 10,56,906 యూనిట్లకు పెరిగాయి.

ఇకపోతే వాణిజ్య వాహనాల అమ్మకాలు 23.70 శాతం వృద్ధి చెంది 51,934 యూనిట్ల నుంచి 64,241 యూనిట్లకు పెరిగాయి. ఇక అన్ని వాహన విభాగాలను కలిపి మొత్తంగా చూస్తే.. అమ్మకాలు 8.99 శాతం వృద్ధి చెంది 12,37,521 యూనిట్ల నుంచి 13,48,753 యూనిట్లకు పెరిగాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, August 10, 2011, 12:00 [IST]
English summary
As per the figures released by the Society of Indian Automobile Manufacturers (SIAM) today, Domestic passenger car sales declined by 15.76 per cent to 1,33,747 units in July, 2011, from 1,58,767 units in the same month last year and motorcycle sales in the country grew by 10.51 per cent during the month to 7,85,278 units from 7,10,621 units in the corresponding month last year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+