ఏప్రిల్ నెల మొత్తం వాహన విక్రయాలలో 22.80 శాతం వృద్ధి

ఇకపోతే మోటార్‌సైకిళ్ల (బైకులు) విక్రయాలు 23.39 శాతం పెరిగి 8,09,565 యూనిట్లు అమ్ముడు కాగా... అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 6,56,096 యూనిట్లుగా ఉన్నాయి. అలాగే మొత్తం ద్విచక్ర-వాహనాలను (మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్లు కలిపి) పరిశీలిస్తే.. ఏప్రిల్ 2011లో ఇవి 26.44 శాతం వృద్ధితో 10,43,970 యూనిట్లుగా ఉన్నాయి. ఏప్రిల్ 2010లో ఇవి 8,25,632 యూనిట్లుగా ఉన్నాయి. వాణిజ్య వాహన విక్రయాలు 8.22 శాతం వృద్ధితో 53,202 యూనిట్లు నమోదు కాగా, గతేడాది ఇదే సమయంలో ఇవి 49,162 యూనిట్లగా ఉన్నాయి. అన్ని విభాగాల వాహన విక్రయాలను కలిపి గమనించినట్లయితే ఏప్రిల్ 2011లో ఇవి 22.80శాతం మాత్రమే వృద్ధి చెంది 13,38,564 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు ఇదే సమయంలో మొత్తం విక్రయాలు 10,90,041 యూనిట్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








