ఆర్‌ఎఫ్‌ఐడి టెక్నాలజీతో డ్రైవింగ్ లైసెన్సుల జారీలో అక్రమాలకు చెక్..!

Driving License Test
ఇకపై డ్రైవింగ్ లైసెన్సుల్లో అక్రమాలకు తెర పడనుంది. డ్రైవింగ్‌లో నైపుణ్యం లేకపోయినా మధ్యవర్తుల సహకారంతో లైనెస్సులు పొందే విధానాలు ఇకపై చెల్లబోవు. పూణేకు చెందిన 'సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్' రూపొందించిన 'రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డ్రైవింగ్' (ఆర్‌ఎఫ్‌ఐడి) సాంకేతిక పరిజ్ఞానం ఈ నెల 6 నుంచి ఉప్పల్‌లోని ప్రాంతీయ రవాణా కార్యాలయంలో అమల్లోకి రానుంది. ఇక నుంచి డ్రైవింగ్ లెసైన్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు ఆర్‌ఎఫ్‌ఐడి ట్రాక్‌లోనే డ్రైవ్ చేసి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ ట్రాక్ ఏర్పాటు కోసం దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు చేశారు.

ఈ డ్రైవింగ్ ట్రాక్‌లో వాహనగమనాన్ని నమోదు చేసేందుకు 1,200 సెన్సార్లు ఉంటాయి. ఈ సెన్సార్ల ద్వారా వాహన గమనానికి సంబంధించిన సమాచారాన్ని కార్యాలయంలోని కంప్యూటర్‌కు చేరవేసేందుకు వాహనానికి ఓ యాంటీనా అమర్చుతారు. ఈ ఏంటీనా ద్వారా మోటారు వాహన తనిఖీ అధికారి కార్యాలయంలోని కంప్యూటర్ స్క్రీన్‌పై మొత్తం నమోదవుతున్న వాహన కదలికలను పరిశీలిస్తుంటాడు. '8', 'H' ఆకారాలు మరియు ఔటర్ ట్రాక్‌లో వాహన కదలికలను బట్టి మార్కులు నిర్ణయించడం జరుగుతుంది. మొత్తం 100 మార్కులకు గాను కనీసం 85 మార్కులు సంపాధిస్తే డ్రైవింగ్ లెసైన్స్ మంజూరు చేస్తారు.

More from DriveSpark

Article Published On: Friday, June 3, 2011, 10:47 [IST]
English summary
The driving tests to be conducted by Regional Transport Authority (RTA) for issuing driving license will now be judged by the computer based Radio Frequency Identification (RFID) system developed by Pune based Central Institute of Road Transport. In this system there are sensors which are placed underneath the test tracks, which very accurately track even the minute deviations in the driving.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+