తాగి వాహనం నడిపితే.. జరిమానాతో పాటు జైలు శిక్ష ఫ్రీ..!

Donot Drink and Drive
తాగినా పర్లేదు, తాగి తూగినా పర్లేదు, కానీ తాగి తూగుతూ వాహనం నడిపి పోలీసులకు చిక్కి క్షమించమని అడిగారనుకోండి.. ఏ భాషలోనైనా వారికి నచ్చని ఒకే ఒక్క పదం 'క్షమించడం' అంటూ వెంటనే కటకటాల వెనక్కి నెట్టడం ఖాయం. ఇటీవలి కాలంలో తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్న వారిలో యువతే ఎక్కువగా ఉన్నారు. ఈ చర్యను మాన్పించేందుకు పోలీసులు / ప్రభుత్వాలు / స్వచ్ఛంద సంస్థలు ఎంత ప్రచారం చేసినా, ఎన్ని కౌన్సిలింగ్‌లు చేసినా, వేల రూపాయలు జరిమానా విధించినా బఫెలో మీద వర్షం పడ్డట్లుగా 'నా దారి రహదారి' అంటూ ఫుల్లుగా మందు కొట్టి వాహనాలు నడుపుతూ అయినవారి ఆశల్ని వమ్ము చేస్తున్నారు.

ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన ఢిల్లీ ప్రభుత్వం తాగి వాహనాలు నడిపే వారిపై కొరడా జులిపించింది. తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కిన వారిని కేవలం జరిమానాతో వదిలిపెట్టకుండా జైలుశిక్ష విధించాలని తేల్చి చెప్పింది. ఈ విషయంలో స్థానిక మేజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లి హైకోర్టు సమర్థించింది. తాగి వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కిన కుమార్ అనే ఓ వ్యక్తి మేజిస్ట్రేట్‌ ముందు తాను తాగి వాహనం నడిపినట్లు ఒప్పుడకున్నాడు. దీంతో మేజిస్ట్రేట్‌ కోర్టు అతనికి రూ. 500 జరిమానాతో పాటు 10 రోజుల జైలు శిక్ష విధించింది. దీంతో కుమార్ ఈ తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. కానీ అక్కడ కుమార్‌కు చుక్కెదురైంది. దీంతో కుమార్ కటకటాల వెనక్కు వెళ్లాడు.

More from DriveSpark

Article Published On: Saturday, June 11, 2011, 16:10 [IST]
English summary
Traffic Police are toughening their stance against drunken drivers. Earlier drivers caught driving after drinking alcohol faced just a fine. However the Delhi Government has decided to impose fine as well as imprison drunken drivers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+