ఆటో ఎక్స్‌పో 2012లో హ్యాచ్‌బ్యాక్‌ను లాంచ్ చేయనున్న రీనాల్ట్

అంతేకాకుండా.. రీనాల్ట్ తన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్‌యూవీ) 'కొలియోస్'ను 2011 చివరి నాటికి విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. 2012లో బి-సగ్మెంట్లో హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసిన తర్వాత తమ నాలుగో కారుగా మరో ఎస్‌యూవీ డస్టర్‌ను విడుదల చేయనున్నట్లు క్లెయిన్ చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో రీనాల్ట్ తన తొలి లగ్జరీ కారు ఫ్లూయెన్స్‌ను మాత్రమే అందిస్తోంది. భారత మార్కెట్లో అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కంపెనీ మరిన్ని మోడళ్లను అందించేందుకు సన్నాహాలు చేస్తుంది.


Click it and Unblock the Notifications








