మెక్‌డొనాల్డ్స్‌లో బర్గర్ తింటే.. మారుతి ఈకో గెల్చుకునే అవకాశం

18 ఏళ్ల వయస్సుకు పైబడి, డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉన్న భారతీయులందరూ ఈ కాంటెస్ట్‌కు అర్హులు. ఈ ప్రమోషన్ అన్ని మెక్‌డొనాల్డ్స్ (వెస్ట్ మరియు సౌత్ రీజియన్లలో మాత్రమే) అవుట్‌లెట్లలో జులై 30, 2011 వరకూ అమలులో ఉంటుంది. మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్లలో వ్యాల్యూ మీల్, హ్యాపీ మీల్ లేదా బ్రేక్‌ఫాస్ట్ మీల్ కొనుగోలుచేసిన వినియోగదారులకు ఈకో హ్యాపీ ఫ్యామిలీ కాంటెస్ట్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్‌లో కారు గురించిన కొన్ని సాధారణ ప్రశ్నలకు వినియోగదారులు సమాధానం తెలిపి ఈకో గురించి ఒక చక్కని నినాదాన్ని (స్లోగన్) రాసి సమర్పించాలి.
ఆ చక్కని స్లోగన్‌లలో ఒకదానిని ప్యానెల్ ఎన్నుకున్న అనంతరం విజేతలను ప్రకటించడం జరుగుతుంది. ఈ కాంటెస్ట్‌లో గెలిచిన విజేతలు మారుతి సుజుకి ఈకో కారును తమ ఇంటికి తీసుకువెళ్లవచ్చు. ఈ ప్రమోషన్ గురించి మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఛీఫ్ జనరల్ మేనేజర్ శశాంక్ శ్రీవాత్సవ వివరిస్తూ.. తమ పోర్ట్‌ఫోలియో ఈకో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని, ఇది సి-సెగ్మెంట్ వాహనాల్లో తమను మరింత బలోపేతం చేసిందని, ఈ సెగ్మెంట్ గత ఆర్థిక సంవత్సరం(2009-10)తో పోలిస్తే 2010-11 ఆర్థిక సంవత్సరంలో 1 లక్ష యూనిట్ల నుంచి 1.6 లక్షల యూనిట్లకు పెరిగిదని, ఇందులో ఈకో ఒక్కటే విడుదలైన 18 నెలల్లో 93,000 యూనిట్లు అమ్ముడయ్యాయని తెలిపారు.


Click it and Unblock the Notifications








