చెవర్లే బీట్ ఎలక్ట్రిక్: ఫుల్ చార్జ్ - 130 కి.మీ. మైలేజ్

Electric Beat
అమెరికాకు చెందిన, ప్రపంచపు అగ్రగామి ఆటోమొబైల్ సంస్థ జనరల్ మోటార్స్ చెవర్లే బ్రాండ్‌లో అందిస్తున్న చిన్న కారు 'బీట్‌'లో ఎలక్ట్రిక్ వేరియంట్‌ను కంపెనీ ఆవిష్కరించింది. చెవర్లే ఎలక్ట్రిక్ బీట్‌ను ఒక్కసారి పూర్తిగా చార్జింగ్‌ చేస్తే 130 కిలోమీటర్లు దూరం ప్రయాణంచవచ్చని కంపెనీ పేర్కొంది. బ్యాటరీ పవర్‌తో నడిచే ఈ కారును జనరల్ మోటార్స్ ఇండియా గురువారం ఢిల్లీలో ప్రదర్శించింది. 300 సెల్ లిథియం-అయాన్ బ్యాటరీతో 'చెవర్లే బీట్ ఎలక్ట్రిక్' కారును రూపొందించినట్లు జనరల్ మోటార్స్ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ కార్ల్ స్లిమ్ తెలిపారు.

బీట్ బీఈవీ (బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్) గంటకు 20 కిలోవాట్ సామర్థ్యముండే 270 కిలోల బ్యాటరీని కారులో అమర్చారు. ఇంకా ఇందులో 45 కిలోవాట్ సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. కాగా.. మరోవైపు కంపెనీ అందిస్తున్న చిన్న కారు స్పార్క్‌ మోడల్‌లో కూడా ఎలక్ట్రిక్ వేరియంట్‌ను ప్రవేశపెట్టేందుకు భారత్‌కు ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ రేవా (మహీంద్రా బ్రాండ్)తో సంస్థ సంప్రదింపులు జరుపుతోంది. జనరల్ మోటార్స్ కూడా రీనాల్ట్ మాదిరిగానే టాటా నోకు పోటీగా చిన్న కారును ప్రవేశపెట్టాలన్న ఆలోచనకు గుడ్‌బై చెప్పినట్లు కంపెనీ తెలిపింది.

More from DriveSpark

Article Published On: Friday, June 24, 2011, 12:58 [IST]
English summary
General Motor's Indian arm Chevrolet today unveiled an electric Beat. This battery powered electric Beat is an experimental model that will be used to asses the potential of such vehicles in India. GM India has not confirmed when it will be launching the electric Beat in the Indian market due to the lack of the proper infrastructure needed to run electric cars.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+