హైదారాబాద్‌లో ఎంట్రీ లెవల్ మహీంద్రా స్కార్పియో విడుదల

Mahindra Scorpio EX
మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీతో రూపొందించిన సరికొత్త స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్‌యూవీ) 'స్కార్పియో ఈఎక్స్'ను మహీంద్రా అండ్ మహీంద్రా రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది వరకే లభిస్తున్న స్కార్పియోలో ఇది ఎంట్రీ లెవల్‌ వేరియంట్ అని, స్కార్పియో ఈఎక్స్ వాహనంలో మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించడం వలన, అది ఇంధమ సామర్థ్యాన్ని పెంచేందుకు దోహదపడుతుంది. ఫలితంగా ఇది లీటరుకు 14 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. స్కార్పియో ఈఎక్స్ ఎస్‌యూవీ నాలుగు ఆకర్షనీయమైన రంగుల్లో బీఎస్3, బీఎస్4 వెర్షన్‌లలో లభిస్తుంది. బీఎస్4 వెర్షన్ స్కార్పియో ఈఎక్స్ ధరను రూ. 7.53 లక్షలు(ఎక్స్ షోరూమ్ హైదరాబాద్)గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.

మాహీంద్రా స్కార్పియో ఈఎక్స్ మోడల్ వాహనం 2.5 లీటర్ ఎమ్2డిఐసిఆర్ (m2DiCR) ఇంజన్‌తో లభిస్తుంది. ఇది 75 బిహెచ్‌పిల శక్తిని, 220 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తూ 11.2 సెకన్లలో 0-60 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఏఆర్ఏఐ (ARAI) ప్రకారం స్కార్పియో ఈఎక్స్ లీటరుకు 14 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. ఇక ఇదే బ్రాండ్‌లో ఉన్న ఇతర మోడళ్లు 120 బిహెచ్‌పిల శక్తిని, 290 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తాయి. ఇంకా ఈ కారు దొంగల బారిన పడకుండా ఉండేలా డిజిటల్ ఇమ్మొబిలైజర్ సిస్టమ్‌తో లభిస్తుంది. అధిక మైలేజ్ ఇచ్చేందుకు గానూ స్కార్పియో ఈఎక్స్ ఇంజన్‌ను తక్కువ పవర్ ఉండేలా తీర్చిదిద్దారు. ఇది రాకీ బీగి, డైమండ్ వైట్, ఫెయిరీ బ్లాక్, మిస్ట్ సిల్వర్ అనే నాలుగు రంగులలో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Sunday, June 12, 2011, 12:45 [IST]
English summary
Country's leading utility vehicle maker Mahindra & Mahindra launched a low priced version of its flagship SUV Mahindra Scorpio in Hyderabad market. The all new Mahindra Scorpio EX priced at Rs. 7.53 Lakhs (Ex-showroom Hyderabad) is powered by a 2.5 Litre m2DiCR engine with a max power of 75 BHP and a max torque of 220 Nm.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+