జై కిసాన్ సిరీస్‌లో కొత్త ట్రాక్టర్లను ప్రవేశపెట్టిన ఎస్కార్ట్స్

ఈ సందర్భంగా ఎస్కార్ట్స్ అగ్రి మెషినరీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్, సిఈఓ రోహ్‌తాష్ మాల్ మాట్లాడుతూ గత ఆరు దశాబ్ధాలుగా ఎస్కార్ట్స్ సంస్ధ భారతీయ రైతుల మన్ననలు పొందిందని, రైతులకు మరింత మేలైన సౌకర్యాలను అందించేందుకు తాము ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు.
వ్యవసాయం రంగంలో మరింత అధిక దిగుబడిని, అధిక లాభాలను ఆర్జించాలంటే ఆధునిక పరికారల అవసరం ఎంతైనా ఉందని, తాము అందిస్తున్న ట్రాక్టర్లు ఇటు వ్యవసాయ, అటు వాణిజ్య రంగాలకు అనువుగా ఉంటాయని మాల్ తెలిపారు. కంపెనీ మొత్తం విక్రయాలలో ఒక్క పంజాబ్, హర్యానాలలోనే 20 శాతం విక్రయాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications








