కొత్త కార్ల విడుదలకు సంబంధించి ఆటో కంపెనీల దోబూచులాట

పాత మోడళ్లకు మంచి డిమాండ్ ఉంటే ఆ మోడల్‌లో కొత్త వెర్షన్ విడుదలను వాయిదా వేయడం, అలాగే తమ పోటీదారు కన్నా ముందుగా లేదా అదే సమయంలోనే కొత్త వాహనాలను విడుదల చేయాలని ఆటోమొబైల్ కంపెనీలు భావిస్తున్నాయి. ఇటీవల టొయోటా మోటార్ కంపెనీ ఈ నెలలో తమ కొత్త కాంపాక్ట్ కారు "లివా"ను విడుదల చేయాల్సి ఉంది. అయితే.. ఇప్పటికే ఈ వేరియంట్లో ఉన్న ఇతియోస్‌కు మాంచి డిమాండ్ వస్తుండటంతో... ఆ డిమాండు కోల్పోవడం ఇష్టం లేక లివా విడుదలను వాయిదా వేయాలని టొయాటా భావిస్తోంది.
అంతేకాకుండా... టొయాటా తన తొలి కాంపాక్ట్ కారు 'లివా'ను మార్చిలో విడుదల చేయనుందని తెలుసుకున్న హోండా కంపెనీ కూడా ఇదే నెలలో తమ తొలి చిన్నకారు 'బ్రియో'ను విడుదల చేయనుందనే వార్తలు గుప్పుమన్నాయి. వాస్తవానికి హోండా కంపెనీ నిర్దేశించిన సమయం ప్రకారం... బ్రియో ఈ ఏడాది సెప్టెంబర్ విడుదల కావాల్సి ఉంది. మరి టొయాటా వాయిదాను చూసి హోండా కూడా బ్రియో విడుదలను వాయిదా వేస్తుందేమో...? ఇలా ఆటోమొబైల్ కంపెనీలు.. కొన్ని సాంకేతి కారణాల వల్లనో, లేక పోటీతత్వ మార్కెట్ వాతావరణం కారణంగానో.. తమ కొత్త విడుదలకు సంబంధించి దోబూచులాటలాడుతున్నాయి.


Click it and Unblock the Notifications








