ఎతియోస్, లివాల మ్యాజిక్: టొయోటా జులై సేల్స్ జంప్

కాగా.. ఇదే ఫ్లాట్‌ఫామ్ విడుదలైన చిన్న కారు ఎతియోస్ లివా దేశీయ మార్కెట్లో సూపర్ హిట్ అయింది. జులై 2011లో కంపెనీ అమ్మకాలు ఏకంగా 98.89 శాతం వృద్ధి చెంది 13,592 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో టికెఎమ్ కేవలం 6,834 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది.
భారత్‌లో పెరుగుతున్న టొయోటా వాహనాల సంఖ్యకు జులై నెల అమ్మకాలు నిదర్శనమని, ఎతియోస్ మరియు ఎతియోస్ లివా మోడళ్లకు వినియోగదారుల నుంచి చాలా మంచి స్పందన లభించిందని కంపెనీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ సింగ్ తెలిపారు. గత నెల మొత్తం అమ్మకాలలో 4,095 ఎతియోస్ సెడాన్ కార్లు ఉండగా, 2,551 ఎతియోస్ లివా హ్యాచ్‌బ్యాక్ కార్లు ఉన్నట్లు ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








