ప్రీమియం కార్లలోనూ సిఎన్‌జి కిట్‍‌ల కోసం క్యూ..!

CNG Cars
పెట్రోల్ మరియు డీజిల్ ఇంధనాల ధరలు భగ్గు మంటుండంతో సాధారణ కార్ల వినియోగదారులే కాకుండా ప్రీమియం కార్లను వినియోగించే వారు కూడా ఇంధన సామర్థ్యాలు, ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి సారిస్తున్నారు. హోండా సిఆర్‌వి, హోండా సివిక్, హోండా సిటీ, టొయోటా క్యామ్రే, టొయోటా కరోలా మొదలగు ప్రీమియం కార్లను ఉపయోగించేవారు ఇప్పుడు మైలేజ్‌పై దృష్టి పెట్టారు.

గడచిన కొద్ది నెలలో ప్రీమియం కార్ యజమానుల నుంచి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ (సిఎన్‌జి) కిట్‌ల కోసం డిమాండ్ గణనీయంగా 25-30 శాతానికి పెరిగనట్లు సిఎన్‌జి కిట్‌ల అమర్చే కంపెనీలు చెబుతున్నాయి. పెట్రోల్, డీజిల్ కన్నా సిఎన్‌జి తక్కువ ధరకే లభించడమే కాకుండా అత్యుత్తమ మైలేజ్‌ను కూడా ఇస్తుండటంతో కొనుగోలుదారులు సిఎన్‌జిపై ఎక్కు ఆసక్తి తూపుతున్నారు.

ఎంట్రీ లెవర్ మోడళ్లయి ఆల్టో, వ్యాగన్ఆర్, ఎస్టిలో మరియు హ్యుందాయ్ శాంత్రో వంటి సిఎన్‌జి వేరియంట్లకు కూడా గిరాకీ భారీగా పెరిగింది. సిఎన్‌జి కిట్‌లను అమర్చుకోవడం ద్వారా ఇంధనంపై 70 శాతం వరకూ ఆదా చేసుకోవచ్చని వీటిని విక్రయించే డీలర్లు చెబుతున్నారు. లీటరు పెట్రోల్ ధర రూ. 68-70 ఉండగా, కేజీ సిఎన్‌జి ధర రూ. 32 గా ఉంది. సాధారణంగా హోండా సిఆర్-వీ కారు లీటరు పెట్రోల్‌కు 6-7 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. అదే సిఎన్‌జిపై అయితే కనీసం 17 కి.మీ. మైలేజ్ ఇస్తుంది.

అంటే ఒక్క లీటరు పెట్రోల్ ధరకు రెండు కేజీల సిఎన్‌జి మరియు 27 కిలోమీటర్ల మైలేజ్ లభిస్తుందన్నమాట. అయితే, విచారకరమైన విషయం ఏంటంటే.. ఈ సిఎన్‌జి వాయువు ఢిల్లీ, మాహారష్ట్ర వంటి కొన్ని ఎంపిక చేసిన రాష్ట్రాలలో మాత్రమే లభ్యమవుతుండటం. మరి దీన్నిబట్టి మీరేమంటారు.. పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్లు బెస్టా..? లేక సిఎన్‌జితో నడిచే కార్లు బెస్టా..!?

More from DriveSpark

Article Published On: Wednesday, July 20, 2011, 15:15 [IST]
English summary
Premium car buyers also now prefer CNG variants due high fuel prices. Honda CR-V, Honda Civic, Honda City, Toyota Camry and Toyota Corolla now seeking CNG versions.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+