ప్రధమార్థంలో 54 శాతం పెరిగిన ఆటో పరిశ్రమ పన్ను వసూళ్లు

ఈ ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2010 - మార్చి 2011)లో ఏప్రిల్ - సెప్టెంబర్ 2010 కాలం నాటికి ఆటో పరిశ్రమ 31 శాతం వృద్ధిని సాధిచిందని, ఇదే సమయంలో ఎక్సైజ్ వసూళ్లు రూ. 11,901 కోట్లకు పెరిగాయని ఎస్ఐఏఎమ్ ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఎక్సైజ్ వసూళ్లు కేవలం రూ. 7,684 కోట్లుగా ఉన్నాయి.
ఆటో పరిశ్రమ నుంచి వెల్లువలా వచ్చిన పన్ను వసూళ్లు ప్రభుత్వానికి ఎంతగానే ఉపయోగపడుతాయని, భవిష్యత్తులో కూడా ఈ పన్ను వసూళ్లు ఇలాగే కొనసాగుతాయని, అలాగే.. ప్రభుత్వం పన్ను విధానాన్ని ఇప్పట్లో సవరించకపోవచ్చునని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) అధ్యక్షుడు పవన్ గియెన్కా ఆశాభావం వ్యక్తం చేశారు.
గతేడాది బడ్జెట్‌లో అన్ని వాహనాల మీద ఎక్సైజ్ డ్యూటీ 2 శాతానికి పెరిగింది. అంతకు ముందు డిసెంబర్ 2008లో ఆర్థిక మాంద్యాన్ని అదుపు చేయడం కోసం ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని 4 శాతానికి తగ్గించింది. ఫలితంగా ఆ ఆర్థిక సంవత్సంలో భారత ఖజానకు రూ. 60,834 కోట్లు వచ్చి చేరాయి. రానున్న కాలంలో కూడా భారత ఆటో పరిశ్రమ దేశీయ, విదేశీయ మార్కెట్లలో ప్రోత్సాహకర వృద్ధిని కనబరచగలదని నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








