ముడి సరుకుల ధరల పెరగడంతో నష్టపోయిన కంపెనీలు

Hero Honda
ద్విచక్రవాహనాల తయారీలో అగ్రగామిగా ఉన్న హీరోహోండా కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారీ నష్టాన్ని చవిచూసింది. డిసెంబర్‌ 31, 2010తో ముగిసిన తృతీయ త్రైమాసికంలో కంపెనీ నికరలాభాలు 19.9 శాతం క్షీణించి రూ. 429 కోట్ల నష్టం వాటిల్లినట్లు హీరోహోండా పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ నికరలాభం రూ. 535.7 కోట్లుగా ఉంది.

ఈ ఆర్థిక సంవత్సరంలో నష్టాలు రావడానికి ముఖ్యంగా.. దిగుమతి సుంకం, ముడి పదార్థాల ధరల పెరుగదలే కారణమని, ఈ పెంపు ఫలితంగా వల్ల కంపెనీ రూ. 126 కోట్లు చెల్లించాల్సి వచ్చిందని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ విక్రయాలు 34.1 శాతం వృద్ధి చెంది రూ. 5,118.19 కోట్ల నికర అమ్మకాలు జరిగాయని గతేడాది ఇదే సమయంలో కంపెనీ నికర అమ్మకాలు రూ. 3,814.4 కోట్లుగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

ఇదిలా ఉండగా.. మరో ప్రముఖ ఆటోమబైల్ సంస్థ అశోక్ లేల్యాండ్ ఈ ఏడాది జనవరి విక్రయాలలో నిరాశజనక ఫలితాలను ప్రకటించింది. ఈ నెలలో కంపెనీ విక్రయాలు రెండు శాకం క్షీణించి 7,711 యూనిట్లకు పడిపోయినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ విక్రయాలు 7,871 యూనిట్లుగా ఉన్నాయి. కాగా.. ఈ జనవరి విక్రయాలలో 6,880 యూనిట్లను దేశీయ మార్కెట్లో విక్రయించగా.. గత జనవరిలో 7,460 యూనిట్లను విక్రయించింది. కానీ ఎగుమతుల్లో మాత్రం పెరుగదలను కనబరిచింది. ఈ జనవరిలో 831 యూనిట్లను విక్రయించగా.. గత జనవరిలో 411 యూనిట్లను మాత్రమే ఎగుమతి చేసింది.

More from DriveSpark

Article Published On: Friday, February 4, 2011, 14:35 [IST]
English summary
Hero Honda faced another blow to its smooth running as its sale profit in Q3 of this fiscal was down by 20% with Rs429 crore. This comes after the split of the JV and in December 2009 it was Rs535.7 crore. This profit came from the net sale to Rs5118.19 crore from the previous year’s Q3 Rs3814.4 crore, a rise by 34.1%.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+