భారత మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఫెరారీ కార్లు

Ferrari
రేస్, స్పోర్ట్స్, లగ్జరీ కార్లలో ఫెరారీ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కళ్లు చెదిరే అందం, అద్భుతమైన పెర్ఫామెన్స్ ఫెరారీ సొంతం. ఇటలీకు చెందిన ఫెరారీ త్వరలోనే భారత్‌లోకి ప్రవేశించనున్నట్లు పేర్కొంది. కాలిఫోర్నియా, 458 ఇటాలియా, 599 జిటిబి ఫియరానో, ఎఫ్ఎఫ్ వంటి ఫెరారీ పాపులర్ మోడళ్లతో కంపెనీ భారత్‌లో అడుగపెట్టనుంది. ఫెరారీ కార్ల ధరల శ్రేణి రూ. 2.2 కోట్ల నుండి ప్రారంభమవుతుంది. ఇందు కోసం భారత్‌లోని శ్రేయన్స్ గ్రూపును ఫెరారీ తమ అధికారిక దిగుమతిదారుగా నియమించుకుంది.

ఫెరారీ కాలిఫోర్నియా ధర రూ. 2.2 కోట్లు, 458 ఇటాలియా ధర రూ. 2.56 కోట్లు, 599 జిటిబి ఫియరానో ధర రూ. 3.37 కోట్లుగా నిర్ణయించారు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ఇటీవల జెనీవాలో ప్రారంభమైన మోటార్ షోలో ఫెరారీ తమ లేటెస్ట్ మోడల్ ఎఫ్ఎఫ్ కారును విడుదల చేసింది. ఇది భారత్‌లోకి అందుబాటులోకి రానుందని కంపెనీ వివరించింది. భారత్‌లో ఫెరారీ డీలర్‌షిప్‌లు ప్రారంభమైన వెంటనే ఈ మోడళ్లను బుకింగ్‌ చేసుకోవచ్చు. తొలి డీలర్‌షిప్ కేంద్రాన్ని న్యూఢిల్లీలోనూ, రెండవ డీలర్‌షిప్ కేంద్రాన్ని ముంబైలోను ఏర్పాటు చేయనున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, March 10, 2011, 17:30 [IST]
English summary
Italian luxury sports car maker Ferrari is all set to debut in Indian market with its all new sports car models like California, 458 Italian, 599GTB Fiorano and the latest FF, with prices starting from Rs 2.2 crore onwards. For Ferrari Indian operations company has appointed the Shreyans Group as its official importer in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+