తొలి ఫోర్-వీల్ డ్రైవ్ మోడల్ ఫెరారీ ఎఫ్ఎఫ్ - షార్ట్ రివ్యూ

ఇటీవల జనీవాలో ముగిసిన 81 అంతర్జాతీయ మోటార్ షోలో కంపెనీ ఈ మోడల్‌ను ప్రదర్శనకు ఉంచింది. ఎఫ్ఎఫ్ కారు ముందువైపు డిజైన్ చూడటానికి దాదాపు 458 ఇటాలియాలా మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఫెరారీ ఎఫ్ఎఫ్, ఇటాలియన్ కార్‌మేకర్ అందిస్తున్న తొలి ఫోర్-వీల్ డ్రైవ్ మోడల్ మాత్రమే కాకుండా.. కంపెనీ నుంచి తొలి హ్యాచ్‌బ్యాక్ వేరియంట్ కూడా కావడం విశేషం. రెండు డోర్లు కలిగిన ఫెరారీ ఎఫ్ఎఫ్ నాలుగు సీట్లతో అధిక లగేజ్ స్థలాన్ని కలిగి ఉంటుంది. వెనుక సీట్లలో కూర్చోవాలంటే డ్రైవర్ పక్క సీటును ముందుకు వాల్చి కారు లోపలికి ప్రవేశించాలి. కారు వెనుక భాగంలో రెండు గల్ఫ్ క్లబ్ కిట్లను పూర్తిగా స్టోర్ చేసుకునేంత స్థలం ఉంటుంది.
ఇంకా వెనుక సీట్లను మడుచుకుంటే మరింత ఎక్కువ లగేజ్ స్థలం కలిసి వస్తుంది. ఇది 6-లీటర్ వీ12 ఇంజన్‌తో 660 బిహెచ్‌పిల శక్తితో, 683 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఫెరారీ ఎఫ్ఎఫ్ కేవలం 3.7 సెకండ్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. ఈ సిస్టమ్‌ను ఫెరారీ కాలిఫోర్నియా మోడల్‌లో కూడా చూడవచ్చు. సాధారణ ఫోర్-వీల్ డ్రైవ్ మోడల్ కార్ల కంటే కూడా ఎఫ్ఎఫ్ 50 శాతం తేలికగా ఉండేలా ఫెరారీ ఈ కారును ప్రత్యేకంగా రూపొందించింది.


Click it and Unblock the Notifications








