ఫెరారీ రంగు మనదిరా..! ఇంజన్‌లో పార్టు మనదిరా..!

ఇలా ఫెరారీకు గుజరాత్‌కు మధ్య ఉన్న సంబంధం ఒక్క రంగులోనే కాదండోయ్.. ఈ కారు ఇంజన్ తయారీలో ఉపయోగించే ఓ కీలక విడిభాగం (పార్ట్) కూడా గుజరాత్‌లోనే లభ్యం అవుతుంది. భావ్‌నగర్‌కు చెందిన తంబోలి కాస్టింగ్స్ లిమిటెడ్ (టిసిఎల్) (తంబోలి క్యాపిటల్ అనుబంధ సంస్థ), ఫెరారీ కారు డైరెక్ట్ ఇంజెక్షన్ గ్యాసోలైన్ ఇంజన్‌లో ఉపయోగించే కనెక్టింగ్ బ్లాక్‌లను తయారు చేస్తుంది. 3.8 సెం.మీ. పొడవు ఉండే ఈ పార్ట్ కార్ ఇంజన్‌లో చాలా కీలకమైనదని టిసిఎల్ డైరెక్టర్ మెహుల్ తంబోలి చెప్పారు. ఇటీవలే ఫెరారీ అధికారు తమ టిసిఎల్ ప్లాంటును కూడా సందర్శించినట్లు ఆయన వెల్లడించారు.
అంతేకాకుండా.. రూ. 36 కోట్ల విలువైన ఈ తంబోలి కాస్టింగ్స్ లిమిటెడ్ ఫోర్డ్, ఫియట్, జనరల్ మోటార్స్, జాన్ డీర్, అశోక్ లేలాండ్, మారుతి సుజుకి, మహీంద్రా వంటి కంపెనీలకు కొన్ని కీలక విడిభాగాలను సరఫరా చేస్తుంది. ఫెరారీ, బిఎమ్‌డబ్ల్యూ, డైమ్లర్ క్రిస్లర్, ఫోక్స్‌వ్యాగన్, జనరల్ మోటార్స్, కియా మోటార్స్ వంటి లగ్జరీ కార్ల కంపెనీలు తమ కార్లకు ఉపయోగించే రంగులో వాడే పిగ్మెంట్‌ను గుజరాత్‌లోని హియుబ్యాచ్ ఇండియా (జర్మన్ హియుబ్యాచ్ అనుంబంధ సంస్థ) నుండి సరఫరా అవుతుంది. అలాగే, మనదేశంలోనే అత్యంత ఖరీదైన బ్రాండ్ ఆస్టన్ మార్టిన్ కార్ల తయారీలో ఉపయోగించే "ఎగ్జాస్ట్ రబ్బర్ హ్యాడ్జర్"ను లక్నోకు చెందిన ఓ విడిభాగాల తయారీ కంపెనీ అయిన ఛోప్రా రీటెక్ రబ్బర్ ప్రోడక్ట్స్ సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








