త్వరలో డ్రైవింగ్ స్కూల్‌ను ప్రారంభించనున్న ఫెరారీ

Ferrari
కంటిచూపుకు సైతం చిక్కకుండా పరుగులు తీసే ఫెరారీ కార్లను నడపడటం అంటే ఆషామాషీ కాదు. వీటి ఇంజన్ సాధారణ కార్ల కన్నా ఎంతో శక్తివతంగా ఉండి తక్కువ సమయంలోనే ఎక్కువ వేగాన్ని అందుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అలాంటి ఫెరారీ కార్లను సవారీ చేయాలంటే కాస్తంత గుండె ధైర్యంతో పాటు కొన్ని మెళకువలు కూడా అవసరం.

ఇటీవలే మన దేశంలోనే మొట్టమొదటి సారిగా జరిగిన ఫార్ములా వన్ రేస్ ఇండియన్ గ్రాండ్ ప్రికు అశేష ప్రజాదరణ లభించింది. ఫార్ములా వన్ రేస్ పట్ల భారతీయుల క్రేజ్‌ను వివిధ ఫారిన్ కార్ కంపెనీలు భారతదేశానికి క్యూ కడుతుంటే.. ఇప్పటికే భారత్‌లో ఉన్న కంపెనీలు తమ కార్లకు సంబంధించి డ్రైవింగ్ స్కూళ్లను ప్రారంభిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫెరారీ భారత్‌లో ఓ డ్రైవింగ్ స్కూల్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. మన దేశంలో కూడా ఫార్ములా వన్ రేస్ ట్రాక్ అందుబాటులోకి రావడంతో నోయిడాకు సమీపంలో ఓ సూపర్ కార్ రేస్ డ్రైవింగ్ స్కూల్‌ను ప్రారంభించాలని, అంతేకాకుండా ఈ సర్క్యూట్‌లో స్వతహాగా రేసింగ్ ఈవెంట్‌ను కూడా ప్రారంభించాలని నిర్ణయించింది.

ఫెరారీ ఇటీవల దేశీయ విపణిలో ప్రవేశపెట్టిన తొలి ఫోర్-వీల్ డ్రైవ్ కారు ఫెరారీ ఎఫ్ఎఫ్ విడుదల సందర్భంగా ఫెరారీ ఛీఫ్ అమెడో ఫెలిసా తెలిపారు. ఫెరారీ ఇప్పటికే అమెరికా, యూరప్ వంటి దేశాలలో కమ కస్టమర్లకు ఇలాంటి డ్రైవింగ్ స్కూల్ సదుపాయాన్ని అందిస్తోంది. కాగా.. జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇప్పటికే ఓ డ్రైవింగ్ స్కూల్‌ను ప్రారభించిన సంగతి కూడా తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Friday, November 4, 2011, 15:19 [IST]
English summary
India appears to be on the fast track to get more fast cars with the start of the First Indian Formula 1 Grand Prix. Ferrari, one of the most famous Formula 1 and sports car manufacturer has now expressed its wish to open super car driving schools and academies in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+