శ్రీలంక మార్కెట్ ఫియట్ లీనియా ఎగుమతులు ప్రారంభం

శ్రీలంకలో నేటి (సెప్టెంబర్ 29, 2011) నుండి లీనియా విక్రయాలు ప్రారంభమవుతాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. శ్రీలంకలో స్పీడ్ ఇటాలియాను తమ పంపిణీదారుగా ఫియట్ ఇండియా ఆటోమొబైల్స్ లిమిటెడ్ నియమించుకుంది. దక్షిణాఫ్రికాకు, నేపాల్‌కు కూడా తమ ఉత్పత్తులను ఎగుమతి చేయడం ప్రారంభించామని కంపెనీ పేర్కొంది. ఈ రెండు మార్కెట్లలో లీనియా, పుంటో కార్లకు మంచి ఆదరణ లభిస్తున్న ఫియట్ తెలిపింది.
శ్రీలంక మార్కెట్లో కూడా లీనియాకు మంచి ఆదరణ లభించగలదని ఫియట్ భావిస్తోంది. ఈ ఎగుమతుల్లో భాగంగా తొలి బ్యాచ్‌లో 72 యూనిట్లను కంపెనీ ఎగుమతి చేసింది. వీటిలో 50 లీనియా కార్లను శ్రీలంక ఎయిర్‌ఫోర్స్‌కు డెలివరీ చేయనున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. రానున్న రోజుల్లలో భూటాన్, ఆస్ట్రేలియా మార్కెట్లలో కూడా తమ ఉత్పత్తులను ప్రవేశపెడతామని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








