పెట్రోల్ కార్ల ధరకే డీజిల్ కార్లను అందిస్తున్న ఫియట్

తక్కువ రన్నింగ్ కాస్ట్ కారణంగా కొనుగోలుదారులు డీజిల్ కార్లను ఎంచుకుంటున్నారని, అయితే పెట్రోల్ వేరియంట్ కార్ల ధరలతో పోలిస్తే డీజిల్ కార్లు అధికంగా ఉండటం వారిని బాధిస్తోందని కంపెనీ తెలిపింది. ఈ మేరకు ఫియట్ డీజిల్ లీనా, డీజిల్ పుంటో కార్లను పెట్రోల్ వేరియంట్ ధరకే, దానికి సమానమైన క్యాష్ బ్యాక్ ఆఫర్‌లను అందిస్తున్నామని కంపెనీ వివరించింది. అంతేకాకుండా.. డీజిల్ కార్లను కొనుగోలుచేసే వారిలో అదృష్టవంతులు ఒక్క ఏడాది పాటు ఇంధన వోచర్లను కూడా పొందవచ్చు. ఇంకా లీనా లేదా పుంటో కార్లకు అప్‌గ్రేడ్ కావడానికి తమ పాత కార్లను ఎక్సేంజ్ చేసుకునే వారికి అదనంగా రూ. 20,000 వరకూ ఎక్సేంజ్ బోనస్ ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








