ఫియట్ కార్ల కోసం 20 నగరాల్లో ప్రత్యేక షోరూమ్‌లు

అయితే, ఈ జాయింట్ వెంచర్ వల్ల ఇటు టాటా మోటార్స్‌కు అటు ఫియట్‌కు పెద్ద లాభం లేకపోవడంతో ఫియట్ ఈ జేవీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించింది. దీంతో వచ్చే ఏడాది నాటికి భారత్‌లోని 20 ప్రధాన నగరాల్లో తమ కార్ల కోసం ప్రత్యేక షోరూంలను ఏర్పాటు చేసుకోవాలని యోచిస్తున్నామని ఫియట్ ఇండియా పేర్కొంది. ఈ షోరూమ్‌ల ద్వారా ఫియట్ తన కార్లను స్వతంత్రంగా విక్రయించుకునే అవకాశం ఉంటుందని ఫియట్ ఇండియా సీఈఓ రాజీవ్ కపూర్ అన్నారు.
వాస్తవానికి భాగస్వామ్య వ్యాపారాలు మొదట్లో సజావుగానే సాగినా తర్వాతి కాలంలో వివిధ కారణాల వల్ల విడిపోవడం సహజమే. భారత ఆటోమొబైల్ రంగంలో నానాటికీ పెరుగుతున్న పోటీ, అందివస్తున్న అవకాశాలు, మరీ ముఖ్యంగా భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందడానికి ఉన్న అన్నిరకాల మౌలిక సదుపాయాలు వంటి పలు కారణాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని కంపెనీలు తమ కార్యకలాపాలను సొంతంగానే నిర్వహించుకోవాలని భావిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భారత్-జపాన్ దేశాలకు చెందిన జాయింట్ వెంచర్ హీరో హోండా, భారత్-ఫ్రెంచ్ దేశాలకు చెందిన మహీంద్రా-రీనాల్ట్ (లోగాన్ కారు తయారీదారుల) తమ జాయింట్ వెంచర్‌లు రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలో రతన్ టాటా కూడా ఈ జాయింట్ వెంచర్‌పై అసహనాన్ని వ్యక్తం చేశారు. అయితే, ఫియట్ తమ కార్ల కోసం ప్రత్యేకంగా షోరూమ్‌లను ఏర్పాటు చేసుకున్నప్పటికీ, టాటా మోటార్స్‌తో ఉన్న సహకార ఉత్పత్తి ఒప్పందం మాత్రం యదావిథిగా కొనసాగనుంది.


Click it and Unblock the Notifications








