ఫియస్టాకు మెరుగులు అద్ది ఫియస్టా క్లాసిక్‌గా మార్చిన ఫోర్డ్

ఇది 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్ సామర్థ్యం కలిగి ఉండి 118 బిహెచ్‌పి (హార్స్ పవర్)తో లభిస్తుంది. అంతేకాకుండా.. డీజిల్ వర్షన్ ఇంజన్‌ను కూడా 1.4 (68 బిహెచ్‌పి) నుండి 1.6 లీటర్ ఇంజన్ (90 బిహెచ్‌పి)కి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇంకా.. ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా ఫియాస్టా క్లాసిక్ ఇంటీరియర్ (కారు లోపలి అలంకరణ)ను కూడా తీర్చిదిద్దుతున్నట్లు కంపెనీ పేర్కొంది. డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో రూపొందించిన ఈ కారును 2011 ద్వితీయ త్రైమాసికంలో విడుదల చేయాలని ఫోర్డ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఫియస్టా క్లాసిక్ ధరను రూ. 6.80 లక్షల నుంచి రూ. రూ. 7.70 మధ్య నిర్ణయించారు.


Click it and Unblock the Notifications








