రోల్స్ రాయిస్ తొలి ఎలక్ట్రిక్ లగ్జరీ కార్

ప్రస్తుతం అందుబాటులో ఇంధనంతో నడిచే లగ్జరీ సెడాన్ ఫాంటమ్ కారు 6.75 లీటర్, 12-సిలిండర్స్ ఇంజన్‌తో సాధారణ సెడాన్లతో పోలిస్తే దాదాపు మూడు లేదా నాలుగు రెట్ల పరిమాణంలో ఉన్న ఇంజన్ కలిగి ఉండి లీటరుకు ఆరు కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఈ ఏడాది మార్చి ఒకటిన జరగనున్న జెనీవా మోటార్ షోలో రోల్స్ రాయిస్ తమ ఎలక్ట్రిక్ కారును ప్రదర్శనకు ఉంచనుంది.
భగ్గుమంటున్న ఇంధన ధరలు, అంతరించిపోతున్న పర్యావరణం వంటి పలు సామాజిక అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి అగ్రశ్రేణి కంపెనీలు కూడా ఈ విభాగంలోకి అడుగపెట్టడం హర్షించదగిన అంశమే అయినప్పటికీ.. సదరు కంపెనీల కార్ల ధరలు మాత్రం సామాన్యులకు అందుబాటులో ఉండే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. ఏదేతైనేం రోల్స్ రాయిస్ చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం కావాలని మనమూ కోరుకుందాం.


Click it and Unblock the Notifications








