ముప్పై సెకన్లలో విమానంగా మారిపోయే 'ఫ్లయింగ్ కార్'..!!

Flying Car
ప్రతి రోజు గంటలు గంటలు నిలిచిపోయే ట్రాఫిక్ జామ్‌ను చూసి విసిగెత్తిపోయారా..? ఒక్కోసారి ఎంచక్కా మీ కారుకు కూడా రెక్కలు ఉండి.. ట్రాఫిక్‌లో నుంచి అలా గాల్లోకి ఎగిరిపోతే చాలా బావుండనిపిస్తుంది కదా..? అయితే మీ కోరిక త్వరలోనే నిజం కాబోతుంది. "ఎగిరే కార్లు" (ఫ్లయింగ్ కార్స్) మన ముందుకు రాబోతున్నాయి. అమెరికాలోని బోస్టన్‌కు చెందిన "టెర్రాఫుజియా ట్రాన్సిషన్" అనే కంపెనీ ఈ ఎగిరే కార్లకు రూపకల్పన చేసింది. అంతే కాదండోయ్ అతి త్వరలోనే కంపెనీ ఈ కార్ల ఉత్పత్తిని చేపట్టనుంది.

రోడ్డుపైనే కాకుండా గాల్లో కూడా ప్రయాణించగలగడం ఈ కారు విశిష్టత. 'ట్రాన్సిషన్‌ రోడబుల్‌ లైట్‌ స్పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌'గా పిలిచే ఎగిరే కారు కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే తన రూపాన్ని మార్చుకోగలదు. అప్పటివరకూ రోడ్డుపై రయ్‌.. మంటూ దూసుకెళ్లే కారు.. ఒక్కసారిగా రెక్కలు విప్పి పక్షిలాగా గాల్లోకి రివ్వున ఎగిరిపోగలదు. రోడ్డుపై గంటకు 65 మైళ్ల వేగంతోనూ, గాల్లో 115 మైళ్ల వేగంతోనూ ప్రయాణించగలిగే సామర్థ్యం ఈ కారు ప్రత్యేకత. ఒక్కో ఎగిరే కారు ధర రూ. 91 లక్షలు, రూ. 1.21 కోట్ల మధ్య ఉండవచ్చని అంచనా.

ప్రతి ఏడాది కనీసం 200 ఎగిరే కార్లను విక్రయించగలమని టెర్రాఫుజియా అధికారి రిచర్డ్ గ్రెష్ భావిస్తున్నారు. ఈ తరహా వాహనం ఇదే మొట్టమొదటిదని, దీనిని ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేయిస్తే 400 నుంచి 450 మైళ్ల దూరం ప్రయాణించ వచ్చునని ఆయన వివరించారు. ఈ కారుకే ఇప్పటి వరకూ 100 ఆర్డర్లు వచ్చాయని, అయితే రోడ్డు, విమానయాన పరిమితులకు సంబంధించి చిన్న చిన్న మార్పులు ఉన్నాయని, ఏదేమైనప్పటికీ ఈ ఏడాది చివరినాటికి ఈ ఎగిరే కార్లను విడుదల చేయాలని భావిస్తున్నామని కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఈ కారును 28 సార్లకు పైగా విజయవంతంగా ప్రయోగించామని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 8, 2011, 9:41 [IST]
English summary
Boston based an American company named Terrafugia Transition, soon is going to launch "The Flying Car" called the Transition Roadable Light Sport Aircraft, which can be transformed from a car to a plane injust 30 seconds.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+