డీజిల్ కార్ల యజమానులపై ప్రభుత్వం కొరడా!

Pranab Mukherjee
ఇక నుంచి డీజిల్ కార్ల వినియోగదారులపై 'వడ్డీ'బాదుడు మొదలుకానుంది. మొత్తం దేశీయ డీజిల్ వినియోగంలో అత్యధికంగా దాదాపు 15 శాతం సబ్సిడి డీజిల్‌ను ప్యాసింజర్ కార్ల యజమానులే వినియోగిస్తుంటడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ఇవాళ జరిగిన లోక్ సభ సమావేశంలో ప్రతిపక్షాల సలాహాలను పరిశీలిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అన్నారు.

"మీ (ప్రతిపక్షాల) సలాహాలను మేము అంగీకరిస్తాం మరియు ఈ సెక్షన్‌లో (డీజిల్ కార్ల యజమానుల) సబ్సిడిలను ఇవ్వకుండా ఉండేందుకు ప్రయత్నిస్తామ"ని ధరల పెరుగుదల అంశంపై లోక్ సభలో ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ప్యాసింజర్ కార్లకు ఉపయోగించే ప్రతి లీటర్ డీజిల్‌పై ప్రభుత్వం రూ. 6.08 సబ్సిడిని ఇస్తోంది. దేశానికి అవసరమయ్యే మొత్తం క్రూడ్ ఆయిల్‌లో దాదాపు 75 శాతం చమురును మనం దిగుమతి చేసుకోవడం జరుగుతోంది.

ఈ మొత్తంలో 10 శాతం డీజిల్‌ను పరిశ్రమలు ఉపయోగిస్తుండగా, రైల్వే సెక్టార్ 6 శాతం డీజిల్‌ను, వ్యవసాయ రంగం 12 శాతం డీజిల్‌ను వినియోగిస్తోంది. అయితే, అత్యధికంగా కార్ల యజమానులే 15 శాతం డీజిల్‌ను వినియోగిస్తున్నారని ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. అలాగే విద్యుత్ ఉత్పత్తి కోసం 8 శాతం, బస్సులు 12 శాతం, ట్రక్కులు 37 శాతం డీజిల్‌ను ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రణబ్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే.. త్వరలోనే డీజిల్ కూడా మరింత ప్రియమయ్యే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 4, 2011, 17:11 [IST]
English summary
Finance Minister Pranab Mukherjee in his address to the parliament on the issue of inflation has sai he was considering to enforce a luxury tax on diesel sold to passenger cars. This will ring alarm bells in both buyers of diesel cars as well as carmakers. There has been a rpid shift towards diesel powered cars in India following the increase in petrol prices.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+