భారత్‌లో ఫోర్స్ మోటార్స్ నుంచి భారీ పెట్టుబడులు

కాగా.. మిగిలిన రూ.750 కోట్లను కార్యకలాపాల విస్తరణ, వ్యాల్యూ చైన్ పటిష్టత కోసం ఖర్చు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఫోర్స్ మోటార్స్ తొలిసారిగా ప్యాసింజర్ వాహన విభాగంలో అందిస్తున్న ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం) 'ఫోర్స్ వన్' అమ్మకాల కోసం ప్రస్తుతం 20 మంది డీలర్లు ఉన్నారని, వీరి సంఖ్యను 44కు పెంచుతామని ఫిరోడియా తెలిపారు.
ప్రతి ఏటా సుమారు 6,000 నుంటి 7,000 ఫోర్స్ వన్ ఎస్‌యూవీలను విక్రయించాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని, ఈ ఏడాది చివరి నాటికి కనీసం 50,000 వాహనాలను విక్రయించి, రూ.4,500 కోట్ల టర్నోవర్‌ను సాధించాలనే లక్ష్యంతో ఉన్నామని ఆయన అన్నారు. ప్రస్తుతం ఫోర్స్ మోటార్స్ మధ్యప్రదేశ్‌లోని పూణలో ఉన్న పీథంపూర్ ప్లాంట్‌లో ఏటా లక్ష వాహనాలను ఉత్పత్తి చేస్తుంది


Click it and Unblock the Notifications








